“ఆరోజు మా తాత చేసిన పనికి నాకు పిచ్చ కోపం వచ్చింది”.. జూనియర్ ఎన్టీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

అదేంటి..? జూనియర్ ఎన్టీఆర్కి వాళ్ళ తాత అంటే చాలా చాలా ఇష్టం కదా..? మరి ఇంత మాట ఎందుకు అన్నాడు అని అనుకుంటున్నారా..? ఇది చదవండి మీకే తెలుస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా అది తక్కువగానే ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ గా పాపులారిటీ సంపాదించుకున్న తారక్ ప్రెసెంట్ దేవర సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . అదేవిధంగా బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకొచ్చాడు. ఈ రెండు కంప్లీట్ అయిపోగానే పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. ఒక సినిమాకి కమిట్ అయ్యాడు. ఆగస్టులో ఈ సినిమాని సట్స్ పైకి తీసుకురాబోతున్నాడు . ఇలాంటి క్రమంలోనే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన పలు వార్తలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి .

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ తన తాత గురించి చేసిన కామెంట్స్ లో మరోసారి ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఒకనాడు తన తల్లి వద్దకు వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ని ఉద్దేశిస్తూ ..”వీడు మా రక్తం .. నందమూరి వారసుడు ..ఇన్నాళ్లు ఒంటరిగా పెంచావు ..ఇకపై మేమున్నాము .. వీడిని నా అంత వాడిగా తీర్చిదిద్దే బాధ్యత నీదే .. నేను వీడి భవిష్యత్తుకి హెల్ప్ చేస్తాను .. నా అంత వాడిగా మార్చుతాను ..నేనున్నాను నేను చూసుకుంటాను” అంటూ మాటిచ్చారట .

అయితే సడన్ గా తాతగారు మరణించారు అన్న వార్త తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ షాక్ అయిపోయారట . అంతేకాదు ఈయన ఏంటి.. నన్ను అన్ని బాగా చూసుకుంటాను అని చెప్పి ఇలా సగంలో చనిపోయాడు అంటూ చాలా చాలా బాధపడ్డారట. తాత మరణ వార్తను జీర్ణించుకోవడానికి తారక్ కి చాలా సంవత్సరాలు పట్టిందట . దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్కి తన తాతగారు అంటే ఎంత ఇష్టం అన్న విషయం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే . అఫ్ కోర్స్ సీనియర్ ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ..? ప్రతి ఒక్కరు ఆయనను అన్నగా తమ ఇంట్లోని మనిషిగా భావిస్తూ ఉంటారు..!!