600 కోట్లు పెట్టి సినిమా తెరకెక్కిస్తూ.. ఆఖరికి అలాంటి పని చేసిన నాగ్ అశ్విన్.. వీడియో వైరల్..!

నాగ్ అశ్వీన్ .. ప్రెసెంట్ ఈ డైరెక్టర్ పేరు సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు అంత తెలిసిన విషయమే . నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయమైన నాగ్ అశ్వీన్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ వచ్చాడు . సంవత్సరానికి ఒక సినిమా తెరకెక్కిస్తాడు అని చెప్పలేం కానీ ..తెరకెక్కించిన సినిమా మాత్రం జనాలకు నచ్చే విధంగానే తెరకెక్కిస్తాడు .

అలాంటి ఓరేర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన డైరెక్టర్ . కాగా ప్రజెంట్ ప్రభాస్ తో కల్కి అనే సినిమాను తెరకెక్కించాడు . జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . కాగా ఈ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఇలాంటి మూమెంట్లోనే నాగ్ అశ్వీన్ ఒక చిన్న కారులో తిరుగుతూ ఉండడం అభిమానులకి షాకింగ్ అనిపిస్తుంది. సినిమా కోసం దాదాపు 600 కోట్లకు పైగానే ఖర్చు చేస్తున్నాడు నాగ్ అశ్వీన్..

అలాంటి స్టార్ డైరెక్టర్ ఒక బుల్లి కారులో తిరుగుతూ ఉండడం జనాలకు విడ్డూరంగా అనిపిస్తుంది . ఏమీ లేని వాళ్ళు కూడా పెద్దపెద్ద కార్లలో తిరిగేస్తున్నారు. మరి అంత ఆస్తి ఉన్న నాగ్ శ్విన్ అంత స్టేటస్ ఉండి కూడా చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఇష్టపడుతున్నారు..ఏంటి..? అంటూ మాట్లాడుకుంటున్నారు జనాలు. దీనికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. నాగ్ అశ్వీన్ చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ని ఇష్టపడతాడు అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు అభిమానులు..!!