ఇక్కడ మీరు చూస్తున్న ఈ కమెడియన్ కొడుకు ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హీరో.. ఎవరో గుర్తుపట్టారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది కమెడియన్స్ ఉన్నారు.. తమదైన స్టైల్ లో నవ్వించిన వాళ్లు ఎంత ఎంతో మంది ఉన్నారు.. కానీ వాళ్ల ఫేస్ లుక్స్ తోనే నవ్వించే కమెడియన్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు . వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తే ఆటోమేటిక్గా నవ్వొచ్చేస్తుంది. అలాంటి ఓ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న కమెడియన్స్ మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉండడం గమనార్హం.. అలాంటి లిస్టులోకే వస్తాడు లక్ష్మీపతి . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ ఫేమస్ కమెడియన్ లలో లక్ష్మీపతి కూడా ఒకరు . తనదైన శైలిలో మాటకారితనంతో.. ఆయన చేసే సందడి అభిమానులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది .

కాగా దాదాపు 50 కి పైగా సినిమాలలో తనదైన స్టైల్ లో నటించిన లక్ష్మీపతికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. లక్ష్మీపతి మొదటగా రచయితగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు . కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన చంద్రలేఖకు రచన సహకారం అందించింది కమెడియన్ లక్ష్మీపతి నే. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు . ఆ తర్వాత చిరంజీవి నటించిన చూడాలని ఉంది చిత్రంలో నటుడుగా మారారు ..ఆ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది.

ఈవీవీ తీసిన అల్లరితోనే అనే సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. కాగా లక్ష్మీపతికి సీనియర్ డైరెక్టర్ శోభన్ స్వయాన తమ్ముడు అవుతాడు . ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మహేష్ బాబు తో బాబి – ప్రభాస్తో వర్షం లకు శోభన్ దర్శకత్వం వహించిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా ఆయన మరణించారు . ఆయన చనిపోయిన నెలరోజులకే లక్ష్మీపతి కూడా మరణించడం అప్పట్లో ఇండస్ట్రీలో అందరిని బాగా బాధపెట్టింది . శోభన్ కొడుకులు ఇప్పుడు ఇండస్ట్రీలో టాలీవుడ్ లో హీరోలుగా రాణిస్తున్నారు . పెద్ద కుమారుడు సంతోష శోభన్ .. 2011లో గోల్కొండ హై స్కూల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మంచి మంచి సినిమాలో నటిస్తున్నాడు . అతని తమ్ముడు సంగీత్ శోభన్ కూడా నటుడిగా రాణిస్తున్నాడు..!!