జైల‌ర్ త‌ర్వాత ఆ మ్యాటర్ లో అస్సలు తగ్గేదెలే అంటున్న రజినీకాంత్.. అదేంటంటే..?!

రజనీకాంత్ సినిమాల విషయంలో దర్శకులకంటే.. స్టోరీ కంటే.. ఆ ఒక విషయానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారంటూ వార్తను నెటింట‌ వైరల్ అవుతున్నాయి. ఏమున్నా లేకపోయినా ఆ విష‌యంలో మాత్రం తను నటించే కథలో కచ్చితంగా ఇంపార్టెంటెన్స్ ఇస్తున్నాడ‌ని స‌మాచారం. జైలర్‌లో వర్కౌట్ అయిన ఆ ఫార్ములానే నెక్స్ట్ సినిమాలను కంటిన్యూ చేస్తున్నాడు తలైవార్. అయితే రజనీకాంత్ సినిమా సక్సెస్ కోసం తీసుకుంటున్న ఆ జాగ్రత్తలు ఏంటో.. ఆ సెంటిమెంట్ ఏమైఉంటుందో ఒకసారి చూద్దాం.

Jailer | Beyond Rajinikanth's Charisma: How Cameos Transformed The Film's  Box Office Fortunes

జైల‌ర్‌ తర్వాత రజనీకాంత్ లో పదింతలు ఉత్సాహం పెరిగింద‌న‌టంలో సందేహం లేదు. మునుప‌టి మీదా తన మార్కెట్ మరింతగా ఇంప్రూవ్ అయింది. గతంలో వరస ఫ్లాపులను ఎదుర్కొన్న సూపర్ స్టార్.. జైలర్ కు ముందు తీసుకున్న జాగ్రత్తల వల్లే జైలర్ మంచి హిట్ అయిందని.. ఇక ఈ హిట్‌తో రజినీకాంత్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయిందని తెలుస్తుంది. ఆడియన్స్ కు ఏం కావాలనుకుంటున్నారో రజినీకాంత్ కు జైలర్ ముందే క్లారిటీ వచ్చిందని టాక్. ఇక ప్రస్తుతం వరుస‌ సినిమాలతో బిజీగా ఉన్న రజనీకాంత్.. సూర్య హీరోగా నటించిన జై భీమ్ మూవీ ఫ్రేమ్ జ్ఞానవేల్ తో పాటు, లోకేష్ కనగ‌రాజ్ సినిమాల్లోనూ నటిస్తున్నాడు.

Thalaivar 171 Title Teaser Release Time Revealed: Exciting Unveiling Of  Rajinikanth & Lokesh Kanagaraj's Movie - Filmibeat

ఈ రెండు సినిమాలు క్యాస్టింగ్ విషయంలో ఆయన జాగ్రత్తలు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. జైలర్లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్‌ అపీరియన్స్ ఉన్న నటులను గెస్ట్ రోల్ కోసం తీసుకొని సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశారు. అలాగే వెట్ట‌యాన్‌కు రతికా సింగ్, మంజు వారియర్స్ లాంటి స్టార్ సెలబ్రిటీలను తెచ్చి సినిమాపై అమ‌చ‌నాలు క్రియేట్ చేసి ఎలాగైనా సక్సెస్ కొట్టాలనే ప్లాన్లో ఉన్నాడట రజనీ. తాజాగా లోకేష్ కనగ‌రాజ్ రూపొందిస్తున్న కల్కిలోను క్యాస్టింగ్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై జూలై 1 నుంచి కూలీ షూటింగ్ మొద‌లు కానుంది. మొత్తానికి జైలర్ నుంచి క్యాస్టింగ్ పై రజిని ఫోకస్ పెట్టి దూసుకుపోతున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.