“అమలాకి ఆ పని చేయడం రాదు”.. నాగార్జున సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది జంటలు ఉన్న అందరికీ కామన్ గా నచ్చే జంట నాగార్జున – అమల . అఫ్ కోర్స్ వీళ్ళ గురించి అందరికీ తెలిసిందే . నాగార్జున ఆల్రెడీ దగ్గుబాటి లక్ష్మీని పెళ్లి చేసుకొని నాగచైతన్యకు తండ్రి అయ్యాడు . అయినా సరే ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చేసి అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . ఆ తర్వాత అఖిల్ కు జన్మనిచ్చారు . అయినా సరే సోషల్ మీడియాలో నాగార్జున కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే ఏ సీనియర్ హీరోకి కూడా ఉండదు అని చెప్పచ్చు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో నాగార్జున అమలపై చేసిన కామెంట్స్ మరొకసారి ట్రెండ్ చేస్తున్నారు జనాలు. అమలకు వంట చేయడం రాదట . ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు నాగార్జున . వాళ్ళ ఇంట్లో వంట మొత్తం చెఫ్ లే చేస్తూ ఉంటారట . అంతేకాదు అమలాకి ఏదైనా కావాలి అన్న కూడా వాళ్ల దగ్గరే వండిచ్చుకొని తింటుందట. అమలా వంట చేయడానికి ట్రై చేసిన ఆ వంట సరిగ్గా రాదట . ఎన్నోసార్లు అమల తనకు ఇష్టమైన వంట చేయడానికి ట్రై చేసిందట .

కానీ అది ఫ్లాప్ అవుతూ వచ్చిందట . చాలా కాలం ఆమెకు వంట చేయడం రాదట..ఇప్పుడిప్పుడే అలా అలా చేస్తుందట.. అని నాగార్జున ఓపెన్ గా చెప్పేయడంతో ఇప్పుడు ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. నిజంగానే అమలకు వంట చేయడం రాదా ..? వాట్ ఇస్ దిస్ అంటూ ఆశ్చర్యకరంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రెసెంట్ అక్కినేని నాగార్జున తన వందన సినిమా కోసం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్లుగా నయనతార – త్రిష ని తీసుకోవాలి అంటూ ఫిక్స్ అయ్యారట నాగార్జున..!!