పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు చెప్తే జనాలు ఓ రేంజ్ లో ఊగిపోతారు. ఇక దానికి తోడు ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే గారు అన్న బిరుదు కూడా ఒకటి వచ్చింది . అంతేనా ఏకంగా మంత్రిగా మారిపోయాడు మన పవన్ కళ్యాణ్ . ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని ఆపలేము.. ఆ విషయం అందరికీ తెలిసిందే . మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక ఎంత మంది చేత నానా బూతులు తిట్టించుకున్నాడో అందరికీ తెలిసిందే.
ఫైనల్లీ ఆయన కష్టానికి ఆయన ఓర్పుకి తగ్గ విజయం వచ్చింది . పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారు . దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్ కి.. సపోర్ట్ చేసే మెగా ఫ్యామిలీ ఈసారి పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేయబోతూ ఉండడంతో ఏకంగా ఫ్యామిలీ ఫ్యామిలీ ఒక బస్సు వేసుకొని మరి కదిలి వచ్చింది.
దానికి సంబంధించిన పిక్స్ బాగా వైరల్ అయ్యాయి . అంతేకాదు కుటుంబం కలిసి ఉంటే ఎవరు మనల్ని ఏమీ చేయలేరు అన్న విషయాన్ని ప్రూవ్ చేసింది మెగా ఫ్యామిలీ . ప్రెసెంట్ మెగా ఫ్యామిలీ చేసిన సందడి కి సంబంధించిన పిక్స్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి . పవన్ కళ్యాణ్ కొనిదెలా అను నేను అని ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చిరంజీవి కళ్ళల్లో ఆనందం మెగా ఫ్యామిలీ కళ్ళల్లో ఆ ఎనర్జీ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది. ప్రెసెంట్ దానికి సంబంధించిన పిక్చర్స్ వైరల్ గా మారాయి..!!