పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం..కన్నీళ్లు పెట్టుకున్న రామ్ చరణ్..ఎందుకంటే..?

కోట్లాదిమంది ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన మూమెంట్ వచ్చేసింది . పవన్ కళ్యాణ్ కొనిదెలా అను నేను అంటూ పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం చేశారు . ఆ రేర్ మూమెంట్ కోసం మెగా ఫాన్స్ ..మెగా ఫ్యామిలీ ఎన్నాళ్లుగా వెయిట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కాగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వెళ్ళింది. అంతేకాదు స్పెషల్ అతిథిగా చిరంజీవి సైతం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు .

ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బిహేవ్ చేసిన పద్ధతి అందరికీ షాకింగ్ గా అనిపించింది . నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని చిరంజీవి దగ్గరికి వెళ్లి స్టేజి మధ్యలోకి తీసుకొచ్చి ఇద్దరి చేతులు పైకి లేపుతూ అభివాదం తెలిపారు . ఆ స్పెషల్ రేర్ మూమెంట్ చూసిన మెగా ఫాన్స్ అరుపులు మొదలుపెట్టారు . అంతేకాదు అది చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు .

ప్రజెంట్ దానికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ గా మారాయి . దీంతో నాన్న – బాబాయ్ ల మధ్య బాండింగ్ చూసిన చరణ్ ఎమోషనల్ అయ్యాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ పిక్చర్స్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు మెగా అభిమానులు. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ మొండి వాడు అని ప్రూవ్ చేసుకున్నాడు. తాను అనుకున్నది సాధించాడు. మొత్తానికి సక్సెస్ అయ్యాడు..!!