టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు తెలుగు, తమిళ, హిందీ భాషలో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నటిస్తూ కోట్లాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. గ్లామర్ ఫోటోలతో పాటు పెర్ఫార్మన్స్ ఓరియంటెడ్ పాత్రల్లో ఇంప్రెస్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పటివరకు మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మలయాళ సినిమాలో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతుందట సమంత.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ న్యూస్ సీని వర్గాలలో తెగ వైరల్‌గా మారింది. మలీవుడ్ స్టార్ హీరో మమ్ముట్టి సినిమాతో ఫిమేల్ రోల్లో నటించినుందని టాక్. ఈ సినిమాతో సమంత మాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందంటూ న్యూస్ ఫిలిం వర్గాల్లో తెగ వైరల్ గా మారింది. పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమా.. హోం బ్యానర్స్ మమ్ముట్టి కంపెనీ తెరకెక్కిస్తోంది. గౌతమ్ మీనన్ డైరెక్షన్‌లో మమ్ముట్టి హీరోగా నటించనున్న ఈ సినిమాలో శ్యామ్ ఫైనల్ అయినట్లు తెలుస్తుంది.
దీనిపై ఇంకా ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇప్పటికే సమంతా, మమ్ముట్టి ఐసీఎల్ ఫిన్‌క్రాప్ యాడ్‌లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఇక సమంత నుంచి గతేడాది గుణశేఖర్ డైరెక్షన్లో వచ్చిన ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ శాకుంతలం రిలీజై బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక శివనిర్వాణా డైరెక్షన్లో విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ఊహించిన రేంజ్ లో అయితే సక్సెస్ అందుకోలేదు. అలాగే ప్రస్తుతం సమంత బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధావన్ తో కలిసి సిటాడల్ వెబ్ సిరీస్ నటిస్తోంది.