“ఆ విషయంలో సైలెంట్ అయిపోయిన పవన్ కళ్యాణ్”..చంద్రబాబుకి కొత్త టెన్షన్ పట్టుకుందా..?

ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో రెండే రెండు పేర్లు మారు మ్రోగిపోతున్నాయి . ఒకటి పవన్ కళ్యాణ్ రెండు చంద్రబాబు నాయుడు . చంద్రబాబు నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .. ఎన్నో ఏళ్ల ఎక్స్పీరియన్స్ .. టాప్ మోస్ట్ సీనియర్ రాజకీయ నాయకుడు.. ఏపీ సీఎం గా నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేశారు . ఆయన సీన్సియారిటీ ముందు ఇప్పుడున్న రాజకీయ నేతలు ఎవరు పనికిరారు అని చెప్పడం సందేహం లేదు. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారిపోయాడు పవన్ కళ్యాణ్ ఆ విషయం అందరికీ తెలిసిందే .

ఏపీలో కూటమి అధికారం చేపట్టింది అన్నా.. చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాడు అన్నా.. దానికి కారణం పవన్ కళ్యాణ్ . అయితే ప్రచార సభల్లో ఓ రేంజ్ లో ఊగిపోతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ విన్ అయిన తర్వాత మాత్రం చాలా చాలా సైలెంట్ అయిపోయాడు . ఎక్కడ కూడా అగ్రెసివ్ స్పీచ్ ఇవ్వడం లేదు . చాలా సైలెంట్ గా తన పని తాను చూసుకోని వెళ్ళిపోతున్నాడు..

ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వెనుక పవన్ కళ్యాణ్ తిరిగితే .. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనుక చంద్రబాబు నాయుడు తిరుగుతున్నాడు అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి . అయితే ఎందుకు సడన్గా పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయాడు అనేది ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కావడం లేదు పవన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీని వెనక ఏదైనా భారీ స్కెచ్ ఉందా..? అనే విధంగా టిడిపి శ్రేణులు మాట్లాడుకుంటున్నారు. చంద్రబాబుకి కొత్త టెన్షన్ పట్టుకున్నట్లే అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు..!!