రిలీజ్ కాకముందే ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ రికార్డ్ సృష్టించిన ప్రభాస్ ‘ కల్కి ‘.. మ్యాటర్ ఏంటంటే..?!

పాన్‌ ఇండియన్ స్టార్ ప్రభాస్ మోస్ట్ ఎవైటెడ్ సినిమా కల్కి గురించి ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో సినిమా రిలీజ్ కు రెండు వారాలు సమయం ఉన్నా.. ఇటీవ‌ల‌ రికార్డ్‌ను సొంతం చేసుకుంది కల్కి. ఇంతకీ కల్కీ క్రియేట్ చేసిన ఆ రేర్‌ రికార్డ్ ఏంటో చూద్దాం. ప్రభాస్, నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ నిర్మించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తుంది.

అమితాబచ్చన్, కమల్ హాసన్, దిశా పఠాని ఇలాంటి ప్రధాన తారాగ‌నం నటిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నాడు. ఇక జూన్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓవర్‌సిస్‌లో కల్కి మూవీ బుకింగ్స్ ఓపెన్ చేశారు. అక్కడ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఓపెనింగ్స్ మొదలైన కొద్ది రోజుల్లోనే కల్కి మూవీ టికెట్స్ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో అప్పుడే కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించింది కల్కి.

Kalki 2898 AD Pre-Sales: Prabhas Erases All-Time Records In USA With Advance  Bookings Surpassing USD 1 Million - Filmibeat

ఇండియాలో కూడా ఈ సినిమా టికెట్లు అమ్మకాలు ప్రారంభమైపోయాయి. ఇక యుఎస్ లో కల్కీ అడ్వాన్స్ సేల్స్ జోరుగా సాగుతున్నాయి. 450 లోకేషన్ లో 1400 షో లుకు పైగా అమ్మకాలు ప్రారంభించిగా.. ఇప్పటికే 35వేల‌కు పైగా టికెట్లు సేల్ అయ్యాయి. సినిమాకు యూయ‌స్‌లో అప్పుడే వన్ మిలియన్ డాలర్లు కలెక్షన్లు వచ్చేసాయి. ఇలా ప్రభాస్ సినిమాకు యూఎస్ లో వచ్చిన రేంజ్ కలెక్షన్స్ మరీ ఏ సినిమాకు రాకపోవడం గ‌మ‌నార్హం.