సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీస్ గా క్రేజ్ సంపాదించుకున్నసెలబ్రెటీల చిన్న చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే సినిమా అప్డేట్సే కాకుండా సెలబ్రెటీల పర్సనల్ విషయాలపై కూడా ప్రేక్షకుల ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తారల రియల్ లైఫ్ ఎలా ఉంటుంది.. ఎలాంటి ఆహారం తీసుకుంటారు.. ఫిట్నెస్ సీక్రెట్.. వారి చిన్ననాటి ఫొటోస్ ఇలా వారికి సంభందించిన ప్రతి విషయంపై ఎప్పటికప్పుడు ఆసక్తి చూపుతూనే ఉంటారు. ఇక ప్రస్తుతం త్రో బ్యాక్ థీంతో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోస్ నెటింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజాగా మలయాళ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో టీనేజ్ ఫోటో నెటింట వైరల్ గా మారింది. తెలుగులోను మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ నూనుగు మీసాల కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. అతనే మల్లీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్. నాలుగు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో భారీ పాపులారిటీతో దూసుకుపోతున్న ఈయన.. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. తను నటించిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా డబై ఇక్కడ సూపర్ సక్సెస్ అందుకున్నాయి.
తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో కీలక పాత్రలో మెప్పించిన మోహన్‌లాల్.. ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస సినిమాలు నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. అయితే తాజాగా మోహన్ లాల్ కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. తన తల్లిదండ్రులతో కలిసి మోహన్‌లాల్ నుంచున ఈ ఫోటో అందరూ దృష్టిని ఆకట్టుకుంది. అప్పట్లో హీరోల స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్న మోహన్ లాల్ ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో మెప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికి రెండుసార్లు ఉత్తమ నటుడు సహా.. నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులను దక్కించుకున్నాడు ఈ స్టార్ హీరో.
మలయాళం తో పాటు తమిళ, హిందీ, తెలుగు, కన్నడ సినిమాలో నటించి సౌత్ స్టార్ హీరోగా ఫేమ్ సంపాదించుకున్న ఈయన.. మే 21, 1960లో పతనం తిట్ట జిల్లాలో ఎలంతూరులో.. విశ్వనాథన్ నాయర్, శాంతకుమారి దంపతులకు రెండవ సంతానం గా జన్మించాడు. ఇక తండ్రి విశ్వనాథన్ నాయర్ కేరళ సెక్రటేరియట్ గా న్యాయవిభాగంలో అధికారిగా వ్యవహరించాడు. ఇటీవల తండ్రి విశ్వనాథ్ తల్లి శాంత కుమారి పేర్ల మీద విశ్వశాంతి ఫౌండేషన్ ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అలాగే తాజాగా డైరెక్షన్ రంగంలోకి అడుగు పెట్టిన మోహన్‌లాల్ బర్రోస్ సినిమాతో సెప్టెంబర్లో ప్రేక్షకులను పలకరించనున్నాడు.