విక్రమార్కుడు 2లో హీరోయిన్ ఎవరో తెలుసా..? ఇక జింతాక జిత జిత జింతాకతా..!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సినిమాలను మనం ఎప్పటికీ మర్చిపోలేం . సినిమా రిలీజ్ అయ్యి ఏళ్లు గడుస్తున్న సరే .. ఆ సినిమాలపై ప్రేమ అలాగే కొనసాగుతూ ఉంటుంది. ఆ మక్కువను మనం అప్పుడప్పుడే మర్చిపోలేం .. తీర్చుకోలేం అలాంటి సినిమాలు ఎన్నెన్నో ఉన్నాయి . వాటిల్లో ఒకటే విక్రమార్కుడు. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమార్కుడు సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేసిందో మనకు తెలిసిందే.

ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మాస్ మహారాజ రవితేజ ఇరగదీసాడు .. జీవించేసాడనే చెప్పాలి . కాగా విక్రమార్కుడు సినిమాకి సీక్వెల్ రావాలి అంటూ ఎప్పటినుంచో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు . అయితే ఇన్నాళ్లకు ఆ టైం వచ్చినట్లు తెలుస్తుంది . కాకపోతే విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ తెరకెక్కించేది రాజమౌళి కాదు అంటూ డైరెక్టర్ సంపత్ నంది అంటూ ఓ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది.

ఈ సినిమాలో హీరోయిన్గా అనుష్క శెట్టి ని అనుకున్నారట. కానీ ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేయడంతో ఈ పాత్ర కోసం లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షి చౌదరిని చూస్ చేసుకున్నారట. ప్రజెంట్ ఈ న్యూస్ బాగా బాగా వైరల్ గా మారింది . ఆఫ్ కోర్స్ అప్పట్లో అనుష్క శెట్టి ఎలా ఉండేదో ..ఇప్పుడు మీనాక్షి చౌదరి అలానే ఉంది . ఈ పాత్రకు బాగా సూట్ అవుతుంది. ఇక జింతాక జిత జిత జింతాకతా అందరికీ అంటూ నాలుక మడత పెట్టి మరి మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఈ న్యూస్ ను ట్రెండ్ చేస్తున్నారు..!!