విజయ్ దేవరకొండ – రష్మిక అందుకే తమ ప్రేమ విషయాన్ని బయట పెట్టడం లేదా..? ఇన్నాళ్లకు బయటపడిన టాప్ సీక్రెట్..!

విజయ్ దేవరకొండ .. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ మంచి హీరో .. అభిమానులు ముద్దుగా రౌడీ హీరో అంటూ పిలుచుకుంటూ ఉంటారు . రీసెంట్ గా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా డిజాస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నారు . అయితే విజయ్ దేవరకొండ సినిమాలు హిట్ అయిన ..ఫట్టయిన అభిమానులు మాత్రం ఎప్పుడూ ఆయనపై ఒకే విధంగా ప్రేమ కురిపిస్తూ ఉంటారు. ఆయన రేంజ్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది .

కాగా విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్నటువంటి రష్మిక మందన్నాతో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు అంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టే వీళ్లకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా వాళ్ళ ప్రేమాయణాన్ని అఫీషియల్ గా చెప్పకపోయినా అనాఫిషియల్ గా బయటపెట్టే విధంగా ఉన్నాయి అంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో సరికొత్త వార్త వైరల్ గా మారింది .

విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా ప్రేమించుకుంటున్నారు . అది వాస్తవమే కాని వాళ్ళు తమ ప్రేమ విషయాన్ని బయటకు పెట్టకపోవడానికి కారణం వాళ్ల వాళ్ల కెరియర్స్ అంటూ తెలుస్తుంది .ఈ విషయం ట్రెండిగా మారింది . ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ కానీ హీరోయిన్ కానీ పెళ్లి చేసుకున్నాక కెరియర్ చాలా వరకు కొలాప్స్ అవుతుంది. మరీ ముఖ్యంగా హీరోయిన్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది . విజయ్ దేవరకొండ కూడా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వలేదు . అందుకే వీళ్ళ ప్రేమాయణాని బయట పెట్టడం లేదట. వన్స్ ఇద్దరు లైఫ్ లో సెటిల్ అయిపోయిన తర్వాత తమ ప్రేమ విషయాన్ని ఓపెన్ గా బయటకు చెప్పడానికి రెడీగా ఉన్నారట . ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట బాగా వైరల్ గా మారింది..!!