పవర్ స్టార్ కోసం రంగంలోకి రెబల్ స్టార్.. గెలవడం ఖాయం అంటున్న అభిమానులు..

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. ఎన్నికల పోలింగ్‌కు కేవలం 12 రోజులు సమయం మాత్రమే ఉండడంతో.. అభ్యర్థులు ప్రచారంలో మరింత బిజీ అయ్యారు. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఉమ్మడి మేనిఫెస్టోని మంగళవారం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కూటమినేతలు ప్రచారంలో మరింత జోరుగా కొనసాగుతున్నారు.

Prabhas Fan Club in Vijayawada | Happy birthday power Star pawan Kalyan  Gaaru From Rebal Star Prabhas Fans🖤🖤 If you success Both films and  politics 🤗 #prabhas#p... | Instagram

ఈ క్రమంలో పవన్ కి మద్దతుగా ఎంతోమంది సినీ సెలబ్రిటీస్ అండగా నిలిచారు. సినీనటులే కాదు.. బుల్లితెర నటులు కూడా ఆయనకు సపోర్ట్ గా ప్రచారంలో దిగుతున్నారు. ఇటీవల పవన్ కి మద్దతుగా చిరంజీవి, నాగబాబు, వరుణ్ తేజ్ ప్రచారాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అండగా నిలిచినందుకు స్టార్ హీరో ప్రభాస్ ప్రచారం చేయబోతున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ పేరు పాలిటిక్స్ లో అడపాదడపా వినిపిస్తూనే ఉంది.

Pawan Kalyan's Speech Objective Achieved, JanaSainiks After Jagan!

తాజాగా జనసేనానికి మద్దతుగా రెబల్ స్టార్ నిలబడుతున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రభాస్ జనసేనానికి అండగా నిలబడుతున్న వార్త నిజమైతే ప‌వ‌న్ గెలుపు కచ్చితం అంటూ అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు పవర్ స్టార్, ఇటు రెబ‌ల్‌ స్టార్ ఇద్దరూ సహాయం అంటే వెనకాడనే వ్యక్తులు కావడంతో.. వీరిద్దరూ కలిస్తే విజయం గ్యారంటీ అంటూ నెటిజ‌న్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.