పుష్ప2 మూవీ నుంచి ఫస్ట్ పాట వచ్చిందోచ్..ఊర నాటు పదాలు..ఈ దేవిగాడు మెంటల్ ఎక్కించేశాడు(వీడియో)..!!

వచ్చేసింది.. కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేసిన ఆ బిగ్ సర్ప్రైజింగ్ మూమెంట్ వచ్చేసింది. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ గాల్లో ఎగిరిపోతున్నంత ఆనందంగా ఉంటారు . ఎందుకంటే వాళ్లు ఇన్నాళ్లుగా వెయిట్ చేసిన పుష్ప2 సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది . పుష్ప – పుష్ప – పుష్ప అంటూ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మ్యూజిక్ సినిమా ను ఓ రేంజ్ లో హిట్ చేయబోతుంది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు .

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప2. ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి అని ప్రత్యేకంగా చెప్పాలా ..? ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా కోసం అభిమానులు చాలా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . కాగా రీసెంట్ గా కొద్దిసేపటి క్రితమే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పాటను పూర్తిగా రిలీజ్ చేశారు .

ఈ పాట మొత్తం వింటుంటే గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి . మరీ ముఖ్యంగా లిరిక్స్ ఈ పాటకి హైలైట్ గా మారాయి . “నువ్వు గడ్దం అట్టా సవరిస్తుంటే..దేశం దద్దరిల్లిపోయే”..అంటూ సాగే లిరిక్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఒక్కసారిగా ఈ పాటలో పుష్పరాజ్ గాడిని ఊహించుకుంటూ ఉంటుంటే నరాలు జివ్వుమనాల్సిందే అంటున్నారు బన్నీ అభిమానులు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఈ పాటకి హైలైట్ గా మారింది అని చెప్పాలి. అంతేకాదు ఈ పాట సినిమాకి ..సినిమా హిట్ అవ్వడానికి కీలకమై మైల్ స్తోన్ గా మారిపోతుంది అంటున్నారు అభిమానులు. ప్రసెంట్ ఈ పాట యూట్యూబ్ ని షేక్ చేసి పడేస్తుంది. మరెందుకు ఆలస్యం జనాలను ఓ రేంజ్ లో పిచ్చెక్కిస్తున్న ఈ పాటను మీరు వినండి .. ఎంజాయ్ చేయండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!