పునీత్ రాజ్ కుమార్ మరణానికి అసలు కారణం ఇదేనా.. షాకింగ్ మ్యాటర్ రివిల్..?!

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ 2021 అక్టోబర్లో 29న గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఉదయాన్నే వ్యాయామం చేస్తున్న పునీత్ రాజ్ కుమార్.. ఒకసారి ఇక చాతి నొప్పిగా అనిపించడంతో గబగబా హాస్పిటల్ కి వెళ్లేందుకు కారు వద్దకు నడిచి వచ్చారు. కారులో చికిత్స కు కావలసిన అన్ని ఏర్పాట్లు చేసి ఉంచినప్పటికీ.. దగ్గరలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తున్న తరుణంలో కార్‌లోనే తుది శ్వాస విడిచాడు. 46 ఏళ్ల పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధతో ఉండేవారు. ప్రతిరోజు వ్యాయామం చేయడం.. ఆహార డైట్ ను ఫాలో అవ్వడం.. ఇలాంటి ఎన్నో హెల్దీ అలవాట్లను అలవర్చుకున్నాడు. అయితే పునీత్ రాజ్ కుమార్ సామాజిక సేవ చేస్తూ రియల్ హీరోగా కోట్లాదిమంది గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

అలాంటి ఆయన గుండెపోటుతో మరణించాడు అన్న వార్త అందరినీ కలిచి వేసింది. సౌత్ ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది స్టార్ సెల‌బ్రెటీస్‌ ఆయన కుటుంబాన్ని కలిసి సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా పునీత్ రాజ్ కుమార్‌కి గుండెపోటు రావడానికి కారణం అదేనంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే గుండెపోటుతో మరణించారనే వాదన బలంగా మారింది. ఇండియాలో కోవిడ్ నుంచి రక్షణ కోసం కోవీషీల్డ్‌, కో వ్యాక్సిన్ అనే రెండు రకాల వ్యాక్సిన్లను ఇస్తున్న సంగతి తెలిసిందే. కో వ్యాక్సిన్ వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని.. అయితే కోవి షీల్డ్ తీసుకున్న వారిలో చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని.. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని తెలుస్తుంది.

పునీత్ రాజ్‌కుమార్ కూడా ఈ కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేయించుకొని ఉన్నారని.. అందుకే గుండెపోటుతో మరణించారు అంటూ పలువురు తమ కామెంట్స్ వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజులు కోవీషీల్డ్ ప్రమాదం అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే కోవీషీల్డ్ తీసుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాగా పునీత్ రాజ్ కుమార్ 2021 లో వ్యాక్సిన్ వేయించుకున్న ఫోటోలో తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకున్నారు. 45 ఏళ్ల పైబడిన ప్రతి ఒక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోండి అంటూ ఆయన ఫోటోతో పాటు షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్ కింద అప్పట్లోనే ఒక అభిమాని సార్ మీరు కోవీషీల్డ్ తీసుకోవద్దు. 45 ఏళ్లు మించిన వారికి అది అసలు శ్రేయస్కరం కాదు అంటూ కామెంట్ రూపంలో వ్యక్తపరిచింది. కాగా ప్రస్తుతం పునీత్ రాజ్ కుమార్ కి గుండెపోటు రావడానికి ప్రధాన కారణం కోవీషీల్డ్ అంటూ ప్రచారం జరుగుతుండడంతో ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు.