పుష్ప1 కి పుష్ప2కి పుష్ప రాజ్ గాడిలో వచ్చిన మార్పు గమనించారా ..? సుకుమార్ హింట్ ఇచ్చేసాడుగా..!

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసేస్తున్న సినిమా పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి . ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల మంది జనాలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా..? ఎప్పుడెప్పుడు పుష్పరాజ్ గాడిని ఊర లెవెల్ మాస్ లుక్స్ లో చూడబోతున్నాము అంటూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది .

ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా వేరే లెవెల్ లో చేయబోతున్నాడు సుకుమార్ అంటూ ప్రచారం జరుగుతుంది . కాగా మరికొద్ది గంటలోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు . ఆల్రెడీ ప్రోమో రిలీజ్ చేసేసారు . పుష్ప – పుష్ప – పుష్ప అంటూ సాగే పాట అభిమానులను ఆకట్టుకుంటుంది . మరికొద్ది గంటల్లో ఈ సినిమాలోని ఫస్ట్ పాట పూర్తిగా రిలీజ్ చేయబోతున్నారు . ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన స్పెషల్ పోస్టును రిలీజ్ చేశాడు పుష్ప2 టీం.

ఈ పోస్టర్లో బన్నీ చేతికి గోరింటాకు పెట్టుకొని ఊర నాటు మాస్ లెవెల్లో కనిపిస్తున్నాడు. అఫ్ కోర్స్ ఇంచుమించు లుక్స్ పుష్ప వన్ లోని పుష్పరాజ్ గాడిలాగే కనిపిస్తూ ఉన్న పుష్ప వన్ సినిమాలో పుష్పరాజ్ చాలా బొద్దుగా ధిట్టగా కనిపించేవాడు. అదే పుష్ప2 సినిమాకు వచ్చేసరికి పుష్పరాజ్ స్లిమ్ అయిపోయాడు. దీని వెనక కూడా సుకుమార్ ఏదో ఒక మర్మం పెట్టే ఉంటాడు అని భారే ట్విస్ట్ ఈ లుక్ తోనే ఇవ్వబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది..!!