సడన్గా బాహుబలి 3 ని అనౌన్స్ చేయడం వెనక ఇంత పెద్ద రీజన్ ఉందా..? రాజమౌళి ప్లానింగ్ వేరే లెవెల్..!

రాజమౌళి .. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . కొత్త ఇంట్రడక్షన్ అంతకన్నా అవసరం లేదు . ఎందుకంటే ఆయన పేరుకి పరిచయాలు చేయాల్సిన అవసరం లేకుండా ..ఉండే పొజిషన్ ని క్రియేట్ చేసుకున్నాడు రాజమౌళి . అభిమానులు ముద్దుగా జక్కన్న జక్కన్న అంటూ పిలుచుకుంటారు. రాజమౌళి పేరు మారు మ్రోగిపోవడానికి మెయిన్ రీజన్ బాహుబలి సినిమా అని చెప్పుకోక తప్పదు . బాహుబలి సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు రాజమౌళి.

బాహుబలి ది బిగ్గినింగ్..బాహుబలి ది కంక్లూషన్ అంటూ రెండు పార్ట్ లు గా తెరకెక్కించారు. రెండు కూడా సూపర్ డూపర్ హిట్ లు అయ్యాయి. తెలుగు చలనచిత్ర రికార్డ్స్ ను బ్రేక్ చేశాయి. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ వచ్చింది అంటే కారణం బాహుబలి అని చెప్పుకోక తప్పదు . కాగా రీసెంట్గా బాహుబలి 3ను అనౌన్స్ చేశాడు రాజమౌళి. దీంతో రాజమౌళి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు . అయితే ఇది యానిమేటెడ్ సిరీస్ గా రాబోతుంది అంటూ ప్రకటించారు .

త్వరలోనే దీనికి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాము అంటూ అఫీషియల్ గా చెప్పుకు వచ్చారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు సరికొత్త చర్చ బాగా వైరల్ గా మారింది . ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న రాజమౌళి సడన్గా బాహుబలి 3 ని ఎందుకు అనౌన్స్ చేశాడు..? ఆల్రెడీ రాజమౌళి మహేష్ బాబుతో సినిమాలు తెరకెక్కించబోతున్నాడు కదా..? మరి ఎలా బాహుబలి త్రీ ని అనౌన్స్ చేస్తారు..? జనరల్ గా రాజమౌళి ఒక ప్రాజెక్టుకి కమిట్ అయినప్పుడు మరొక ప్రాజెక్ట్ అనౌన్స్ చేయరు.. ఫర్ ద ఫస్ట్ టైం ఎందుకు రూల్స్ బ్రేక్ చేశాడు ..? దీని వెనక ఏదో పెద్ద స్కెచ్ ఏ వేశాడు అంటున్నారు జనాలు. ప్రజెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!