క‌న్నాను చూశాం… 2 సార్లు టీడీపీని చూశాం.. ఈ సారి నో డౌట్ ర‌జ‌నీకే ఛాన్స్‌..?

వామ్మో విడ‌ద‌ల ర‌జ‌నీ డైన్‌మిక్ అనుకున్నాం గాని.. మ‌రి ఇంత డైన‌మిక్ లేడీనా.. ఆ స్పీడ్ ఏంది.. ఆ దూకుడు ఏంద‌ని గుంటూరు జిల్లా టీడీపీ వాళ్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. గుంటూరు పార్ల‌మెంటుకు పెమ్మ‌సాని లాంటి బ‌ల‌మైన నేత‌ను రంగంలోకి దించాం.. ఇక మ‌న‌కు తిరుగు ఉండ‌దు.. ఆ పార్ల‌మెంటు ప‌రిధిలో అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ మ‌న‌మే గెలుస్తున్నాం అని అతి ధీమాతో ఉన్న చంద్ర‌బాబు, గుంటూరు టీడీపీ నేత‌ల‌కు ర‌జ‌నీ దూకుడుతో చుక్క‌లు చూపించేస్తోన్న ప‌రిస్థితి.

రాజ‌కీయాల‌కు పూర్తిగా కొత్త అయినా జ‌స్ట్ ఎన్నిక‌ల‌కు కొద్ది నెల‌ల‌కు ముందే వైసీపీ కండువా క‌ప్పుకున్నా చిల‌క‌లూరిపేట‌లో టీడీపీ రాజ‌కీయ దిగ్గ‌జం, అప్ప‌టి మంత్రి ప్ర‌త్తిపాటి పుల్ల‌రావుకే చుక్క‌లు చూపించి ఓడించింది. ఎమ్మెల్యే అయిన రెండున్న‌రేళ్ల‌కే మంత్రి ప‌ద‌వి రాష్ట్రానికే హైలెట్ అయ్యింది. ఇప్పుడు ర‌జ‌నీ అంటే తెలుగు గ‌డ్డ‌పై తెలియ‌ని వారుండ‌రు. రాజ‌కీయాల్లో ద‌శాబ్దాలుగా ఉన్న సీనియ‌ర్ నేత‌లే చాలా మందికి ఇప్ప‌ట‌కీ తెలియ‌రు.. కానీ ర‌జ‌నీ అలా కాదు.. ఆమె ఛ‌రిష్మా, బ‌ల‌మైన వాయిస్‌.. ఏదో చేయాల‌న్న త‌ప‌న‌, క‌సి ఇవ‌న్నీ ఆమెను అన‌తి కాలంలోనే తెలుగు ప్ర‌జానికానికి ద‌గ్గ‌ర చేశాయి.

గుంటూరు వెస్ట్‌కు వ‌చ్చిన‌ప్పుడు ఇక్క‌డ ఉన్న టీడీపీ అతిర‌థ మ‌హార‌థులు అంద‌రూ ఆమెకు మేం చుక్క‌లు చూపించేస్తాం అని జ‌బ్బ‌లు చ‌రుచుకున్నారు. క‌ట్ చేస్తే ఇప్పుడు ర‌జ‌నీ దూకుడు దెబ్బ‌కు వాళ్ల‌కు దిమ్మ‌తిరిగి పోయి వాళ్ల‌కే చుక్క‌లు క‌న‌ప‌డుతోన్న ప‌రిస్థితి. ఆమెకు వెస్ట్ ఇన్‌చార్జ్ ఇచ్చి రెండు నెల‌లు అయ్యిందో లేదో ఎన్నిక‌ల కోడ్ వ‌చ్చేసింది.. ఈ రెండు నెల‌ల్లోనే సంవ‌త్స‌రాలుగా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల‌ను చ‌క‌చ‌కా కంప్లీట్ చేసేశారు.

వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో నాలుగు ప్ర‌ధాన రాహ‌దారుల‌ను కేవ‌లం వారం రోజుల్లో కంప్లీట్ చేసి చూపించారు. ఇక్క‌డే వెస్ట్ జ‌నాల‌కు ర‌జ‌నీ మీద బాగా గురి, న‌మ్మ‌కం కుదిరాయి. మ‌నం ర‌జ‌నీని గెలిపించుకుంటే చాలు ఖ‌చ్చితంగా ఆమె మ‌ళ్లీ మంత్రి అవుతుంది… క‌న్నాను గెలిపిస్తే మంత్రి అయ్యాడు.. చేసిందేమి లేదు.. ఆ త‌ర్వాత రెండుసార్లు టీడీపీని గెలిపించి చూశాం.. నో యూజ్‌.. ఈ సారి మాత్రం ర‌జ‌నీకి ఓటేయ‌క‌పోతే మ‌న భ‌విష్య‌త్తును మ‌న‌మే కాల‌ద‌న్నుకున్న వాళ్లం అవుతాం అన్న ఆలోచ‌న ఈ సారి వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా మందిలో క‌లుగుతోంది. మ‌రి అంతిమంగా గుంటూరు ఓట‌రు నాడి ఎలా ఉంటుందో ? ప‌ది రోజుల్లో జ‌రిగే పోలింగ్‌లో తేలిపోనుంది.