“హరిహర వీరమల్లు” టీజర్ చూశారా.. రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన పవన్.. టీజర్ అదిరిపోయిందిగా(వీడియో)..!

ఈ మధ్యకాలంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపైనే కాన్సెంట్రేషన్ చేశారు . ఎక్కడ కూడా సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయలేకపోయారు. ఆ సమయం కూడా ఆయనకి రాలేదు . కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తెరపై కనిపిస్తే చూడాలి అంటూ ఫ్యాన్స్ చాలా చాలా ఈగర్ గా ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేశారు. చాలామంది దేవుడికి పెద్దపెద్ద మొక్కులు కూడా మొక్కేశారు . అయితే దేవుడు వాళ్ల మొరను ఆలకించినట్లు ఉన్నారు. రీసెంట్గా ఆయన నెక్స్ట్ నటించబోతున్న హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ .

ఎప్పటినుంచో ఈ టీజర్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు . ఫైనల్లీ ఆ మూమెంట్ వచ్చేసింది . కాగా హీరో క్రిష్ దర్శకత్వంలో ఏ ఎం రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు పై అభిమానులు ఎలా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది . పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్స్ కారణంగా పక్కన పెట్టేశారు. కాగా తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ .

పవన్ కళ్యాణ్ కెరియర్ లోని ఫస్ట్ టైం పాన్ ఇండియా పిరియాడిక్ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెంచేసుకున్నారు. ఈ సినిమా నుంచి ధర్మం కోసం యుద్ధం అనే పోస్టర్తో టీజర్ రిలీజ్ చేశారు . టీజర్ లో మొఘల్స్ కాలంలో అందరూ ప్రజలను దోచుకుంటూ ఉంటే వాళ్లని దోచుకోవడానికి ఒక దొంగ ఎంట్రీ ఇస్తాడు . 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒకే ఒక్క యోధుడి కథ అంశంతో ఈ మూవీ ఉండబోతున్నట్లు చిన్న టీజర్ తోనే చూపించేశారు.

టీజర్ అయితే చాలా క్లీన్ గా క్లియర్ గా రియలిస్టిక్ గా ఉంది . పవన్ కళ్యాణ్ ఖాతాలో మరో హిట్ పడబోతుంది అంటూ ఈ టీజర్ చెప్పేస్తుంది. పవన్ యాక్షన్ సీన్స్ లో కుమ్మి పడేసాడు అని చెప్పాలి . ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ ఇలాంటి యాక్షన్ సీన్స్ లో నటించడం మనం ఎక్కడా చూడలేదు. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ టీజర్ ని ట్రెండ్ చేస్తున్నారు .మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా టీజర్ పై ఓ లుక్ వేయండి.. టీజర్ ఎలా ఉందో కామెంట్ రూపంలో మీ ఆన్సర్ తెలియచేయండి..!!