అబ్బబ్బా.. ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళకి.. ఆ క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన బుట్ట బొమ్మ.. ఈసారి హిట్ కొట్టినట్టే..?!

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెల‌బ్రెటీగా క్రేజ్‌ సంపాదించుకోవాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. అయితే ఆ స్టార్‌డంను నిలబెట్టుకోవాలన్న అదే రేంజ్ లో కష్టపడాల్సి ఉంటుంది. అయితే శ్రమతో పాటు పిసరంత అదృష్టం కూడా ఉంటేనే వారు స్టార్ సెలబ్రిటీస్‌గా కొనసాగగ‌లుగుతారు. అలా ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టి మంచి పాపులారిటి దక్కించుకుంది పూజ హెగ్డే. మొదట్లో వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ హిట్లు అందుకున్న ఈ అమ్మడు.. అదే క్రేజ్‌తో అవకాశాలన్నింటికీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సినిమాలను నటించింది. అయితే వరుసగా ఫ్లాప్ లు ఎదురవడంతో.. ఒక్కసారిగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. దీంతో ఈమెకు టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి.

Will Industry Entertain Pooja Hegde Now?

ఈ క్రమంలో బాలీవుడ్లో తన అదృష్టాన్ని చెక్ చేసుకునేందుకు సిద్ధమైంది. అక్కడ కూడా ఆమెకు ఫ్లాప్ లే ఎదురయ్యాయి. దీంతో దాదాపు ఏడాదికి పైగా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది పూజ హెగ్డే తాజాగా ప‌లు అవకాశాలు అందుకుంటుంద‌ట. ఫ్లాపులు ఎదుర్కొన్న పూజ హెగ్డే.. చివరిగా బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ యొక్క కిసి కి భాయ్ కిసి కి జాన్ సినిమాలో కనిపించింది. 2023 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేదు. అప్పటినుంచి పూజ హెగ్డే నుంచి ఒక్క సినిమా కూడా రాలేదు. తాజాగా అక్కినేని నాగచైతన్య సినిమాల్లో పూజా హెగ్డే నటించే ఛాన్స్ కొట్టేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నాగచైతన్య విరూపాక్ష ఫేమ్‌ కార్తీక్ వర్మ దర్శకత్వంలో నటించనున్న సినిమాలో ఈమెకు అవకాశం వచ్చిందట‌.

Radhe Shyam Actress Pooja Hegde Checks Into Maldives with Customary  Swimsuit Pic - News18

తాజా సమాచారం ప్రకారం గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్గా రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే నటించనుందట. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. దీంతోపాటే బాలీవుడ్ లోనూ ఓ అవకాశాన్ని అందుకుందని తెలుస్తుంది. ఒక క్రేజీ ప్రాజెక్టుకు పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలో షాహిద్ కపూర్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసిందని.. దేవా అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తుంది. ఈ సినిమాకి బాలీవుడ్ డైరెక్టర్ రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహిస్తున్నాడు. పూజ హెగ్డేకు వరుస ఫ్లాపులు వచ్చినప్పటికీ ఆమెకు ఏమాత్రం క్రేజ్‌తగ్గలేదు అనడానికి ఈ ప్రాజెక్టు నిదర్శనం. అయితే బుట్ట బొమ్మ సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. దీంతో ఈమె ఇప్పుడు నటించబోయే సినిమాలు ఎలాగైనా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది.