అనిల్ రావిపూడిని ముసుగేసి కొట్టినవారికి పదివేలు ఇస్తా.. రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. కారణం ఇదే..?!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ తాజాగా నటించిన మూవీ కృష్ణమ్మ. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవ‌ల ఘనంగా జరిగింది. ఈవెంట్ కు దర్శకధీరుడు రాజమౌళి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని హాజరై సందడి చేశారు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. కాగా ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో జక్కన్న డైరెక్టర్ అనిల్ రావిపూడిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అనిల్ రావిపూడి ని ఎవరైనా మోసగేసి కొడితే వెంటనే రూ.10,000 ఇస్తానంటూ ఆయన కామెంట్స్ చేయడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Satyadev Krishnamma movie release on May 3rd

అయితే రాజమౌళి అనిల్ రావిపూడి ని అలా అనడానికి కారణం ఏంటో.. ఒకసారి చూద్దాం. డైరెక్ట్ రాజమౌళి తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ తో రానున్న సంగతి తెలిసిందే. గ్లోబల్ రేంజ్ లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఈ సినిమా రూపొందనుంది. అయితే సినిమా ఓపెనింగ్ డే ఎప్పుడు.. రాజమౌళి చెప్పాలంటూ అనిల్ రావిపూడి ప్రశ్నించారు. దేవర గురించి కొరటాల శివను అడిగాడు. రాజమౌళి స్పీచ్ లో ఓపెనింగ్ డే ఎప్పుడు ఓపెనింగ్ డే రోజు ఆయన సినిమా కథ చెబుతారు.. అసలు ఏ జానర్‌లో ఈ సినిమా తీస్తున్నారు తెలుసుకోవాలని చాలా ఆసక్తిగా ఉంది. ఆ రెండు విషయాలను చెబుతారని ఆశిస్తున్న అంటూ నవ్వుతూ ప్రశ్నించారు.

SS Rajamouli Super Fun With Anil Ravipudi @ Krishnamma Pre Release Event |  Filmy Time

అయితే మహేష్ బాబు తో రాజమౌళి సినిమా గురించి అనిల్ అడిగిన ప్రశ్నకు.. జక్కన్న సరదాగా స్పందించ్చాడు. అనీల్‌ను ఎవరైనా ముసుగేసి గుద్దేస్తే రూ.10,000 ఇస్తానంటూ కామెంట్స్ చేశారు. ఎవరైనా ఓ కెమెరా పట్టుకొని వెనకాల నడుస్తూ.. ఇంకొకరు అనిల్ రావిపూడి మీద ముసుగేసి కొట్టాలి..10,000 ఇస్తా అంటూ సరదాగా వివరించాడు. దీంతో అనిల్ రావిపూడి స్పందిస్తూ.. దయచేసి ప్రైజ్ మనీ తగ్గించండి.. ఓ రెండు రూపాయలు అని చెప్పండి 10,000 అని చెబితే కచ్చితంగా వచ్చేస్తారు సార్ అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం వీరిద్దరి మధ్యన జరిగిన ఈ ఫన్నీ కాన్వర్జేషన్ నెట్టింటే తెగ ట్రెండ్ అవుతుంది.