సాయి పల్లవి ఆ పార్ట్ కు సర్జరీ చేయించుకుందా.. సినిమా ఛాన్స్ కూడా అందుకే వచ్చింది.. సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్..?!

టాలీవుడ్ స్టార్బ్యూటీ సాయి పల్లవికి తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. లేడీ సూపర్ స్టార్ గా స్టార్ హీరోకు ఉండే రేంజ్ లో క్రేజ్‌ సంపాదించుకుంది ఈ అమ్మడు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమా నుంచి బోల్్డ్‌ టచ్ లేకుండా డీ గ్లామ‌ర‌స్‌ పాత్రలో నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఆమె నటించే ప్రతి సినిమాలోను తన నటనతో ఆకట్టుకున్న‌ ఈ అమ్మడు తన న్యాచురల్ నటనతో మన ఇంట్లో అమ్మాయి అనిపించేంతలా ప్రేక్షకులను మెప్పించింది. మాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ప్రేమమ్‌తో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి.. తర్వాత తెలుగు స్టార్ హీరోయిన్గా మారి భారీ పాపులారిటీతో దూసుకుపోతుంది.

అయితే రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ అమ్మడు తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఇందులో భాగంగా ఇంటర్‌వ్యూవ‌ర్ మీ ముఖం మీద మొటిమలు మాయమయ్యాయి.. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో మొటిమలు ఎక్కువగా కనిపించేవి.. మీరు వాటికి సర్జరీ చేయించుకున్నారా అంటూ.. ప్రశ్నించింది. దానిపై సాయి పల్లవి నవ్వుతూ స్పందించింది. అమ్మాయిల ఏజ్ ను బట్టి మొటిమలు వస్తూ.. పోతూ.. ఉంటాయి. వాటికి సర్జరీ చేయించాల్సిన పని ఉండదు. నిజానికి నా ఫస్ట్ సినిమాలో ఛాన్స్ కూడా మొటిమల కారణంగానే వచ్చింది అవి ఉన్నా నాకు ఇబ్బంది లేదు అంటూ వివరించింది.

A photo of Ranbir and Sai Pallavi from the sets of Ramayana went viral –  Tezzbuzz

ప్రస్తుతం సాయి పల్లవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో మీరు ఎంత డీసెంట్ పాత్రలో నటిస్తారో.. ఎలాంటి పాత్రలకు ఇంపార్టెన్స్ ఇస్తారా అందరికీ తెలుసు. మీలాంటి నటులపై ఇలాంటి చెత్త రూమర్స్ క్రియేట్ అయిన ఎవరు నమ్మరు అంటూ.. తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమాల‌ విషయానికి వస్తే ప్రస్తుతం నాగ చైతన్య తండేల్‌ సినిమాతో పాటు బాలీవుడ్ లోనూ పలు సినిమాల్లో బిజీగా ఉంది. అంతేకాదు నితిష్ తివారి డైరెక్షన్లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఇతిహాస గాధ రామాయణంలోనూ సాయిపల్లవి సీతగా నటిస్తుంది. దీనికి సంబంధించిన పిక్స్ ఇటీవల లీక్ అయి తెగ వైరల్ గా మారాయి. దీంతో ఈమె లుక్ అమేజింగ్ అంటూ సీత గెటప్ మీకు చాలా బాగా సెట్ అయింది అంటూ తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు.