అందరూ ప్రాంక్ అనుకున్నారు.. ఆ హీరోయిన్ నన్ను కాపాడకపోయి ఉంటే అప్పుడే చనిపోయే వాడిని.. టాలీవుడ్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఓ సినిమాని రూపొందుతుందంటే.. వాటిలో కొన్నిసార్లు క‌థ హైలెట్ కావ‌టం కోసం స్టంట్స్‌ చేయాల్సి ఉంటుంది. అయితే అలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయినా కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. ఒకప్పుడు టాలీవుడ్ హీరో కమ్‌ నటుడిగా క్రేజ్‌ సంపాదించుకున్న హరీష్ కుమార్ కూడా.. ఇలాంటి ఓ షాకింగ్ ఇన్సిడెంట్‌ను ఎదుర్కొన్నానంటూ వివరించాడు. హీరోయిన్ కరిష్మా కపూర్.. తనని ఆ ప్రమాదం నుంచి కాపాడిందని.. లేదంటే అప్పుడే చనిపోయేవాడిని అంటూ వివరించాడు.

Interesting Facts about Hero Harish Kumar | Birthday Special - Sakshi

ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటో.. హరీష్ కుమార్ ఎదుర్కొన్న ఆ చేదు సంఘటన ఏంటో ఒకసారి తెలుసుకుందాం. 1990లో హీరోగా భారీ పాపులారిటి దక్కించుకున్న నటులలో హరీష్ కుమార్ ఒకరు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన.. చిన్న వయసులోనే ప్రేమ ఖైదీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో స్విమ్మింగ్ పూల్ సీన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అది షూట్ చేస్తున్న టైంలో తాను తృట్టిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాను అంటూ వివరించాడు. అప్పటి విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పుకొచ్చాడు హరీష్ కుమార్.

Karisma Kapoor was 17-years-old in Prem Qaidi while her co-star Harish was  15-years-old - Masala

కరిష్మా క‌పూర్ స్విమ్మింగ్ పూల్ లో దూకుతుంది. ఆ తర్వాత నేను పూల్లో దూకి ఆమెను కాపాడాలి. సినిమాలో మీరు చూసిన సన్నివేశం ఇదే.. కానీ షూటింగ్లో జరిగింది దీనికి రివర్స్. నాకు ఈత రాదు.. దీంతో పూల్లో దూకిన కాసేపటికి నేను మునిగిపోయా. నేను ఫ్రాంక్ చేస్తున్నానని అంతా భావించారు. కానీ కరిష్మా నన్ను పట్టుకున్నారు. నేను ఆమె స్విమ్‌ సూట్ ని పట్టుకున్ని ఒడ్డుకి వ‌చ్చా. అలా ఆరోజు ప్రాణాలతో బయటపడ్డ అంటూ నటుడు హరీష్ కుమార్ వివరించారు. కాగా తెలుగులో కొండవీటి సింహం, రౌడీ ఇన్స్పెక్టర్, పెళ్ళాం చెబితే వినాలి, కొండపల్లి రత్తయ్య, గోకులంలో సీత లాంటి ఎన్నో హిట్ సినిమాలో నటించిన ఆక‌ట్టుకున్నాడు. హిందీ, మలయాళం లోను పలు సినిమాల్లో న‌టించాడు. 2017 వరకు సినిమాల్లో నటుడిగా కొనసాగాడు. ఆ తర్వాత పెద్దగా బయట ప్రపంచానికి కనిపించలేదు.