ఆర్‌ఆర్‌ఆర్ సినిమా సినిమాతో తారక్, చెరణ్ ఇద్దరు గ్లోబల్ స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా భారీ సక్సెస్ అందుకుని కలెక్షన్ల రికార్డులు కురిపించింది. 1200 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టింది. రామ్ – భీమ్ పాత్రలో ఎన్టీఆర్, చరణ్ తమ నటనతో మెస్మరైజ్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత తారక్, చరణ్ నుంచి ఇప్పటివరకు వెండితెరపై ఒక్క సినిమా కూడా రాలేదు. కాగా ప్రస్తుతం తారక్ దేవర సినిమా, చరణ్ గేమ్ చేంజర్ సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికి ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, ప్రోమో లు విడుదలై ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలను పెంచేశాయి. అయితే దేవర, గేమ్ చేంజర్ సినిమాల కథ ఒకటే అంటూ.. రెండు సినిమాలు మధ్యన మైండ్ బ్లాకింగ్ కామన్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ అవేంటో ఒకసారి తెలుసుకుందాం. దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని టాక్. అలాగే గేమ్ చేంజర్ లో కూడా రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో నడిపిస్తున్నారు. ఇక దేవరలో ఎన్టీఆర్.. తండ్రి, కొడుకుల పాత్రలో నటిస్తున్నాడు. గేమ్ చేంజర్ లోను రామ్ చరణ్ అదే పాత్రలో కనిపించనున్నాడు. ఇక రెండు సినిమాలు పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ తో తెరకెక్కనున్నాయి. అయితే దేవర సినిమాల్లో తండ్రి దేవా పేదల కోసం కష్టపడి ఫిష్ హర్బర్ నిర్మిస్తాడని.. దానిపై ఆధిపత్యం కోసం విలన్ దేవాన్ని చంపేయడం.. దేవ కొడుకు వర తండ్రిని చంపిన వారిపై రివేంజ్ తీర్చుకునేందుకు సిపోర్ట్ ను సొంతం చేసుకోవడం నేపథ్యంలో సినిమా తెరకెక్కుతుందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
గేమ్ చేంజర్ సినిమా స్టోరీ కూడా ఇంచుమించు దీనికి దగ్గరగా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్ మారినప్పటికీ.. గేమ్ చేంజర్ కూడా రివెంజ్ డ్రామా కావడం.. నీతి, నిజాయితీగల రాజకీయ నాయకుడైన రామ్ చరణ్ ఒక పార్టీని స్థాపించి.. అధికారంలోకి రావడం. అధికార దాహంతో పక్కనే ఉన్న నమ్మిన బంటు వెన్నుపోటు పొడవడం.. వంచనకు గురవడం.. తర్వాత ఆయన కొడుకు రామ్ చరణ్ ఐఏఎస్ అధికారిగా మారి తండ్రిని వెన్నుపోటు పొడిచి అధికారంలో అనర్ధాలు తలపెడుతున్న వారిపై రివెంజ్ తీర్చుకోవడం.. కథాంశంగా సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది. నేపథ్యం మారిన గేమ్ చేంజర్, దేవర సినిమాలో ఇలా ఎన్నో రకాల కామన్ పాయింట్స్ ఉన్నాయి.
అలాగే ఈ రెండు సినిమాల్లోని సీనియర్ నటుడు శ్రీకాంత్ నటిస్తుండడం విశేషం. గేమ్ చేంజర్ లో ఆయన విలన్ కాగా.. దేవరలో మాత్రం శ్రీకాంత్ పాత్ర పై ఇంకా క్లారిటీ రాలేదు. అంతేకాదు ఈ రెండు సినిమాల్లోనూ బాలీవుడ్ భామలు వీరికి జంటగా నటిస్తున్నారు. దేవరా కోసం జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. గేమ్ చేంజర్ సినిమా కోసం చరణ్ జంటగా కియరా అద్వాని రంగంలోకి దిగింది. అలాగే రెండు సినిమాలు బడ్జెట్ దాదాపు 300 నుంచి 350 కోట్లు అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల మధ్య ఆసక్తికర పోలికలను నెట్టింటి వైరల్ అవడంతో.. అంత ఆశ్చర్యపోతున్నారు. అయితే అభిమానులు మాత్రం తమ హీరో నటించిన సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.