నా లైఫ్ లో పెళ్లి అనే చాప్టర్‌కు ప్లేస్‌లేదు.. హీరోయిన్ సదా షాకింగ్ కామెంట్స్ వైరల్..?!

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో సెన్సిటివ్ విషయం. అలారే అది వారి జీవితంలోనే అతిపెద్ద సెలబ్రేషన్. కానీ ప్రస్తుత కాలంలో చాలామంది హీరోయిన్స్ ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎంతో సెలెక్టివ్ గా తమ పార్ట్నర్స్ ను ఎంచుకుంటూ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే చాలామంది జీవితాల్లో పెళ్లి మూడు నాళ్ళ‌ ముచ్చటగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎవ‌రిని పడితే వారిని చేసుకోవడానికి హీరోయిన్స్ ఇష్టపడడం లేదు. దీంతో చాలామంది పెళ్లి చేసుకోకపోవడమే బెటర్ అని కూడా ఆలోచన చేస్తున్నారు. ఇలా ఆలోచించే వారి జాబితాలో నటి సదా కూడా చేరిపోయింది.

జయం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అపరిచితుడు లాంటి మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అయినప్పటికీ ఈమెకు ఊహించిన రేంజ్ లో ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం పలు డ్యాన్స్ షోలకి జడ్జిగా వ్యవహరిస్తూ.. ఇండస్ట్రీలో కొనసాగుతుంది. కాగా సదా పెళ్లికి ఇప్పటికి దూరంగానే ఉంది. నాలుగు పదులు వయసు దాటుతున్నప్పటికీ.. ఇంకా పెళ్లి వైపు ఏ మాత్రం ఆసక్తి చూపటం లేదు సదా. ఇక గ‌త‌ కొంతకాలంగా సొంత యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తుంది ఈ అమ్మడు. బుల్లితెరపై కూడా పలు షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సదా.. పెళ్లి విషయంలో మాత్రం తనకు ఫుల్ క్లారిటీగా ఉందంటూ వివరిస్తుంది.

తను పెళ్లి చేసుకోవడం కన్నా.. హ్యాపీ లైఫ్ లీడ్ చేయడం ముఖ్యం అని ఆలోచనలో ఉందట. తన లైఫ్ రోజుకో విధంగా ఉంటుందని.. తన ప్రయారిటీస్ మారిపోతూ ఉంటాయని.. తనను అర్థం చేసుకునే భర్త దొరకడం అస్సలు సులువు కాదంటూ వివరించింది. అందుకే ఇప్పటికీ పెళ్లి గురించి అసలు ఆలోచన చేయలేకపోతున్నా అంటూ సదా చెప్పుకొచ్చింది. పెళ్లి అంటే కేవలం ఒకరి జీవితమే కాదు.. రెండు జీవితాలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరితో ఒకరు కలిసి జీవించాలి. ఎవరి అభిప్రాయాలు కలవకపోయినా ఆ బంధం కష్టతరంగా మారుతుంది అంటూ వివరించింది. అందుకే పెళ్లి కంటే సంతోషం పైనే తాను ఫోకస్ పెడుతుందని.. ఇక పెళ్లి చేసుకోకుండా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను అంటూ వివరించింది.