బిగ్ బ్రేకింగ్: సలార్ 2 లో ప్రభాస్ జాన్ జిగిడి దోస్త్.. ఇక బాక్స్ ఆఫిస్ బ్లాస్ట్ అవ్వాల్సిందే..!

ప్రజెంట్ రెబెల్ అభిమానులు ఎంతో ఎంతో ఇష్టంగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా కల్కి. జూన్ 27వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ చాలా స్థాయిలో కష్టపడ్డాడు అంటూ మనం వార్తలు విన్నాం . అయితే ఈ సినిమా తర్వాత అంతేగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న సినిమా సలార్ 2. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఐటెం సాంగ్ పాత్రలో కీయరా అద్వానీ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది . అయితే ఈ సినిమాలో ఆల్రెడీ పృథ్వీరాజ్ సుకుమారన్ మనకి కీలకపాత్రలో కనిపించబోతున్నాడు . సలార్ పార్ట్ 1 లోనే ఆ విషయం క్లారిటీ వచ్చేసింది . అంతేకాదు జగపతిబాబు కూడా ఈ సినిమాలో చాలా చాలా కీలకంగా ఉండే పాత్రను చూస్ చేసుకున్నారు . అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మరో స్టార్ నటుడు కూడా భాగం కాబోతున్నట్లు తెలుస్తుంది.

ఆయన మరెవరో కాదు అమితాబచ్చన్ . ఆల్రెడీ ప్రెసెంట్ కల్కి సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు ప్రభాస్తో అమితాబచ్చన్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూమెంట్లోనే ప్రభాస్ అమితాబ్ జాన్ జిగిడి దోస్తులుగా మారిపోయారు . అయితే సలార్ 2లో కీలక పాత్ర కోసం అమితాబ్ ని చూస్ చేసుకున్నాడు ప్రశాంత్ నీల్ అనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . దీంతో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు . బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం పక్క అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!