బిగ్ షాకింగ్: చెప్పకుండా పెళ్లి చేసుకున్న స్టార్ హీరో.. మెడలో తాళి..చేతిలో పాస్ పోర్ట్..పిక్స్ వైరల్..!

ఈ మధ్యకాలంలో ఇది సినిమా ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ గా మారిపోయింది . చెప్పకుండానే పెళ్లి చేసుకొని లాస్ట్ మూమెంట్లో పెళ్లి ఫోటోలు రిలీజ్ చేయడం. ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్ సెలబ్రెటీస్ ఇదే విధంగా చేశారు . అయితే తాజాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న నటుడు జై కూడా ఇదే పని చేసినట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన హీరోయిన్ ప్రగ్యా నగరాతో కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు.

అది కూడా మెడలో తాళిబొట్టుతో కనిపించారు . అంతేకాదు చేతిలో పాస్ పోర్ట్స్ పట్టుకొని కొత్త లైఫ్ బిగిన్ అయింది అంటూ రాసుకొచ్చారు . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి. వీళ్ళిద్దరూ నిజంగానే పెళ్లి చేసుకున్నారా..? హనీమూన్ కి వెళ్తున్నారా..? అనే ప్రచారం కొనసాగుతుంది . లేకపోతే ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం ఇలా జనాలను బకరాలు చేయడానికి ఈ విధంగా ఫోటో షేర్ చేశారా..? ఏమో ..? దీనిపై క్లారిటీ రావాలి అంటే జై పూర్తిగా స్పందించాల్సిందే .

గతంలో హీరోయిన్ అంజలిని ప్రేమించాడు జై అని ప్రచారం జరిగింది . వాళ్ళు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ అప్పట్లో ఓ రేంజ్ లో కోలీవుడ్ మీడియా కోడై కూసింది . ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు కారణంగా వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారట . ఇప్పుడు మరో హీరోయిన్ తో ఇలా మెడలో తాళితో ఫొటోస్ షేర్ చేయడం సంచలనంగా మారింది. ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి..!!