నాకు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదే.. ఇలియానా షాకింగ్ కామెంట్స్..!!

గోవా బ్యూటీ ఇలియానాకు ఒకప్పుడు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాజూకు నడుము సుందరి ఇలియానా అంటే కుర్ర కారు కలల రాకుమారిగా ఉండేది. ఓ అయుదారేళ్ళు తెలుగు తెరపై తన హవా చూపించిన ఈ అమ్మడు.. ఒక్కసారిగా సినిమాలకు దూరమైంది. ఈ విషయంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన ఇలియానా.. తనకు అవకాశాలు రాకపోవడానికి కారణం ఇదేనంటూ వివరించింది. 2006లో నా దేవదాసు మూవీ రిలీజ్ అయిందని.. అప్పటినుంచి ఆరేళ్లపాటు తెలుగు ఇండస్ట్రీలో నేను బిజీ బిజీగా గడిపానని.. 2012లో బర్ఫీ రూపంలో బాలీవుడ్ లో అవకాశం రావడం.. ఇలాంటి మంచి అవకాశం వదులుకోకూడదు అనే ఉద్దేశంతో బాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పానని వివ‌రించింది.

ఆ సినిమా రిలీజై మంచి సక్సెస్ సాధించిందని వివరించింది. అయితే ఓ విధంగా నాకు సినిమాల్లో అవకాశాలు రాకపోవడానికి కారణం మాత్రం బర్ఫీనే అంటూ చెప్పుకొచ్చింది. ఈ మూవీ సక్సెస్ సాధించడంతో.. ఇక నేను తెలుగులో నటించినని టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఫిక్స్ అయిపోయారని.. దాంతో నాకు అవకాశాలు రాకుండా వేరొకరికి వెళ్లిపోయాయి. అందరూ అనుకున్నట్టే బాలీవుడ్ లో నాకు నిజంగా మంచి అవకాశాలు వచ్చాయి. అయితే నేను ఏ పాత్ర ఒప్పుకున్న 100% చేయగలను అని నమ్మకం ఉన్న సినిమాలకు మాత్రమే ఎంచుకుంటూ నటించానని.. ఈ క్రమంలో మంచి మంచి అవకాశాలు కూడా రిజెక్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

అయితే అప్పట్లో నేను వదులుకున్న బాలీవుడ్ సినిమాలు చాలా బాగా ఆడి మంచి సక్సెస్ అందుకున్నాయని.. దీంతో ఆ సినిమాల్లో నటించిన హీరోయిన్ స్టార్ హీరోయిన్స్ గా మారారంటూ వివరించింది. అయితే ఈమె పలు సినిమాల్లో నటించినప్పటికీ తర్వాత మెల్లగా బాలీవుడ్ లోనూ అవకాశాలు తగ్గాయని.. ఇదంతా ఫేట్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల విద్యాబాలన్, ఇలియానా కలిసి నటించిన దో ఔర్ దో ప్యార్‌ సినిమాతో చాలా గ్యాప్ తర్వాత.. మళ్లీ సక్సెస్ అందిందంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తున్నానంటూ వివరించింది ఇలియానా. ఈమె చేసిన కామెంట్స్ నెటింట వైరల్ గా మారాయి.