అందరి ముందే భర్తను ముద్దులతో ముంచెత్తిన స్టార్ హీరో భార్య.. ఏం మంచి పని చేశాడో తెలుసా..!

నవీన్ చంద్ర.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . సోషల్ మీడియాలో తనకంటూ స్పెషల్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా దక్కించుకున్నాడు . మరి ముఖ్యంగా కొత్త కొత్త పాత్రలు చేస్తూ డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు . నవీన్ చంద్ర హీరో గానే కాకుండా విలన్ గా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు .

గత సంవత్సరం నవీన్ చంద్ర “మంత్ ఆఫ్ మధు” అనే సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో స్వాతి ,శ్రావ్యానవేలి , జ్ఞానేశ్వరి, హర్ష పలువురు కీలక పాత్రలో మెప్పించారు . ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా జనాలకు మాత్రం బాగా నచ్చేసింది. తాజాగా ఈ మంత్ ఆఫ్ మధు సినిమాలోని నటనకు గాను నవీన్ చంద్ర బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు. 14వ దాదాసాహెబ్ పాల్కే ఫీచర్ ఫీలిం ఫెస్టివల్ లో బెస్ట్ మేల్ యాక్టర్ అవార్డు నవీన్ చంద్ర ఈ సినిమాకు గాను అందుకోవడం గమనార్హం .

దీంతో అభిమానులు ఆయనకు విషెస్ అందజేస్తున్నారు . ఢిల్లీలో అవార్డు తీసుకొని హైదరాబాద్కు రాగానే ఎయిర్పోర్ట్లో నవీన్ చంద్ర భార్య సర్ప్రైజ్ చేసింది. బొక్కే తీసుకొని ఎయిర్పోర్ట్ లో తన భర్త కోసం ఎదురు చూస్తూ సడన్గా హగ్ చేసుకొని ముద్దుపెట్టింది. దీంతో సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ వైరల్ గా మారాయి . క్యూట్ కపుల్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!

 

 

View this post on Instagram

 

A post shared by Naveen Chandra (@naveenchandra212)