బెంగుళూరు రేవ్ పార్టీ ట్వీస్ట్: ఆ తెలుగు స్టార్ డైరెక్టర్ హేమను అడ్డంగా బుక్ చేసేశాడా..?

టైం బ్యాడ్ ..సమయం మనకు అనుకూలించినప్పుడు .. పరిస్థితులు చేయి జారిపోయినప్పుడు.. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు .. ఎవరిచ్చిన సలహానైనా సరే పాటించేస్తాం.. అది ప్రతి ఒక్కరు కామన్ గా చేసే తప్పే. రీసెంట్గా అలాంటి తప్పే చేసింది హేమ అంటూ ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న హేమ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని కూడా క్రియేట్ చేసుకుంది . తెరపై హేమ నటన చూస్తే మెస్మరైజ్ అవ్వని వాళ్ళు అంటూ ఉండరు . అంతలా తన పర్ఫామెన్స్ తో అదరగొట్టేస్తుంది .

రీసెంట్గా బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఆమె కూడా పాల్గొనింది.. ఎంజాయ్ చేసింది అన్న వార్త సంచలనంగా మారింది . అయితే నేను ఎక్కడికి వెళ్ళలేదు .. నేను హైదరాబాదులోనే ఉన్నాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది హేమ . కానీ బెంగళూరు పోలీసులు ఆమెకు షాక్ ఇస్తూ.. హేమ రేవ్ పార్టీలో ఉంది అంటూ సంచలన ఫొటోస్ వీడియోస్ ను రిలీజ్ చేశారు . ఆ వీడియోలో హేమ వేసుకున్న డ్రెస్ కన్నడ పోలీసులు రిలీజ్ చేసిన వీడియోలో హేమా వేసుకున్న డ్రెస్ ఒకటేగా ఉండడం గమనార్హం.

అయితే నిజానికి హేమ క్యారెక్టర్ అలాంటిది కాదు ..తప్పు చేసిన ఒప్పుకునే టైపు .. మరి హేమ ఎందుకు రేవ్ పార్టీకి వెళ్లిన విషయాన్ని దాచిపెట్టి .. సడన్గా ఒక వీడియో రిలీజ్ చేసింది .. అంటే మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ డైరెక్టర్ అంటూ ప్రచారం జరుగుతుంది. మొదటినుంచి ఆమె ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కు జాన్ జిగిడి దోస్తుగా ఉంటూ వచ్చింది. అంతేకాదు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హేమ పేరే మారుమ్రోగిపోతుంది . ఆ డైరెక్టర్ ఇచ్చిన సలహా మేరకే హేమ ఇలా ఒక వీడియోని రిలీజ్ చేసింది ..అంటూ కూడా ప్రచారం జరుగుతుంది . దీంతో హేమ పేరు మారుమ్రోగిపోతుంది..!