శంకర్, అల్లు అర్జున్ కాంబోలో కొత్త మూవీ.. ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్..?!

పాన్ ఇండియ‌న్‌ స్టార్ట్ డైరెక్టర్‌గా క్రేజ్‌ సంపాదించుకున్న శంకర్ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్ సినిమా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరోసారి పాన్ ఇండియా లెవెల్‌లో తన సత్తా చూపించాలని గ్రాండ్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడు శంకర్. ఇందులో భాగంగా ఈ సినిమా తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అల్లు అర్జున్‌తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. కాగా ఆ సినిమా జెంటిల్మెన్ సినిమాకు సీక్వెల్ గా రానిందని తెలుస్తుంది. ఇకపోతే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో బిజీగా ఉన్నాడు. మరి ఈ సినిమా తర్వాత శంకర్ కి బ‌న్ని డేట్స్ ఇచ్చే అవకాశం ఉందా.. లేదా.. అనే అంశం ప్రస్తుతం నెటింట ఆసక్తిగా మారింది.

Allu Arjun Trivikram Srinivas Film: Two Challenges, Endless Potential

కాగా పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ తో సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. అలాగే సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో మరో సినిమాకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో శంకర్ తో సినిమా అంటే దాదాపు రెండు నుంచి మూడేళ్లు సమయం పడుతుంది. మరి ఇంత బిజీ లో శంకర్ తో అల్లు అర్జున్ సినిమా నటిస్తాడా.. లేదా.. అనేది ప్రస్తుతం హాట్‌ టాపిక్ గా మారింది. మొత్తానికి శంకరా అల్లు అర్జున్‌తో సినిమా నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Gentleman Telugu Cinema Britain, SAVE 35%, 56% OFF

ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నాడు. ప్రస్తుతం ఆయన తెలుగులోనే వరుస సినిమాలు చేయడానికి కమిట్ అవుతున్నాడు. ప్రస్తుతం తమిళ్లో ఒక్క సినిమా కూడా చేయ‌ని శంకర్ తెలుగులో రామ్ చరణ్‌తో గేమ్ చేంజర్‌ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమాతో పాటు కమలహాసన్ నాయకుడు, ఇండియన్ 2 సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి రానున్నాయి.