వార్నీ.. వీళ్లు మరీ ఓవర్ గా ఉన్నారే.. కాజల్ ని తన భర్త ముద్దుగా అలా పిలుస్తాడా..?

సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ పెట్ నేమ్ తో పిలుచుకోవడం కామన్ . మరీ ముఖ్యంగా కొంతమంది చాలా ఫన్నీగా చాలా వెరైటీగా చాలా నాటిగా కూడా పిలుచుకుంటూ ఉంటారు . అయితే తమ భర్తని లేదా భార్యని ఏమని పిలుస్తారు అనే విషయాన్ని ఎక్కడ బయట చెప్పుకోరు . అది వాళ్ళ పర్సనల్ మ్యాటర్ ..రామ్ చరణ్ – ఉపాసన ..బన్నీ – స్నేహ రెడ్డి.. జూనియర్ ఎన్టీఆర్ – లక్ష్మీ ప్రణతి .. ఎంతోమంది టాప్ సెలబ్రిటీస్ వీళ్ళ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు మాత్రం బయట పెట్టరు .

అయితే తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాత్రం తన భర్త తనని ముద్దుగా రొమాంటిక్ క్యూట్గా ఎలా పిలుస్తాడు అనే విషయాన్ని బయట పెట్టేసింది . అది తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు. బెడ్ రూమ్ మ్యాటర్ ని బయట పెట్టేస్తున్నారు ఏంటి కాజల్ అని కొందరు అంటుంటే .. మరి కొందరు మాత్రం కాజల్ గౌతం కిచులు మధ్య ఉన్న ప్రేమని పొగిడేస్తున్నారు . కెరియర్ పిక్స్ లో ఉండగానే గౌతమ్ కిచులు ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కాజల్ అగర్వాల్ .

ఆ తర్వాత ఓ బిడ్డకి కూడా జన్మనిచ్చేసింది. కాగా ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీగా ఉంది కాజల్ అగర్వాల్. రీసెంట్గా తన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” తన భర్త తనను ముద్దుగా ఏమని పిలుస్తాడు అనే విషయాన్ని బయటపెట్టింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ గా మారిపోయింది.” గౌతమ్ కిచ్లు.. కాజల్‌ని ‘కన్నా’ అని పిలుస్తాడట. కాజల్ తన భర్త గౌతమ్‌ని ‘సామి’ అని పిలుస్తుందని తెలిపింది. ఈ రెండు పేర్లు తెలుగులో కూడా బాగా పాపులర్ కావడంతో ఫ్యాన్స్, నెటిజన్లు కాజల్, గౌతమ్ క్యూట్ గా భలే పిలుచుకుంటున్నారు, క్యూట్ కపుల్ అని కామెంట్స్ చేస్తున్నారు.