దట్ ఈజ్ తారక్..ఫ్యాన్స్ సంతోషం కోసం ఏం చేశాడో చూడండి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా సరే ఎన్టీఆర్ పేరు చెప్తే వచ్చే ఆ కిక్ .. ఆ మజా చాలా వెరైటీగా ఉంటుంది . రీసెంట్ గానే తన 41వ పుట్టినరోజు చాలా చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు . సోషల్ మీడియా వేదికగా పలువురు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ శ్రేయోభిలాషులు తారక్ కి బర్త్డ డే విషెస్ అందించారు. సెలబ్రిటీస్ కూడా తారక్ కీ బర్త్ డే విషెస్ అందించారు . మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ – మహేష్ బాబు – బన్నీ లాంటివాళ్ళు ఎన్టీఆర్ ను స్పెషల్ గా పొగిడేశారు.

తాజాగా ఎన్టీఆర్ తన ప్రియమైన అభిమానుల కోసం తనకు విష్ చేసిన వాళ్ల కోసం ఒక పోస్ట్ రిలీజ్ చేశారు. “ప్రియమైన అభిమానులారా.. నటుడిగా నా ప్రయాణం మొదలైన మొదటి రోజు నుంచి మీరంతా నాకు అండగానే ఉన్నారు .. ఆ విషయం నాకు తెలుసు .. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు థాంక్యూ .. మీ అసామాన్య ప్రేమకు నేను ఎప్పుడు కృతజ్ఞుడని .. దేవర సినిమాలోని పాటకు మీ అందరి నుంచి మంచి స్పందన రావడం చాలా చాలా ఆనందంగా ఉంది . నా స్నేహితులకు కుటుంబ సభ్యులకు శ్రేయోభిలాషులకు చిత్ర పరిశ్రమంలోని సహచరులు అందరికీ నాకు పుట్టినరోజు విష్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ” అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు .

ఈ పోస్ట్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు సాధారణంగా ఏ స్టార్ హీరో బర్త్డ డే అయిన ఇదేవిధంగా జనాలు విష్ చేస్తారు . కానీ ఏ హీరో కూడా ఫ్యాన్స్ కోసం ఇలా సపరేట్ నోట్ రిలీజ్ చేయరు . కేవలం ఎన్టీఆర్ మాత్రమే ఇలా చేస్తూ ఉంటాడు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. దట్ ఈజ్ ఎన్టీఆర్ అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు నందమూరి అభిమానులు..!!