ఎన్టీఆర్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ నటుడు.. తెల్ల హీరోలు కుళ్లుకుని చావాల్సిందే..!

ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి.. ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . అదేవిధంగా చాలామంది స్టార్స్ కూడా ఆయనను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. రీసెంట్ గానే ఎన్టీఆర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో నైట్ పార్టీలో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే .

ఈ పార్టీకి ఆయన తన భార్య లక్ష్మి ప్రణతితో కలిసి హాజరు కావడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది . జనరల్ గా లక్ష్మీ ప్రణతిని ఎక్కడికి బయటికి తీసుకుని వెళ్లడు ఎన్టీఆర్. మరీ ముఖ్యంగా ఇలాంటి పార్టీస్ కి అస్సలు తీసుకెళ్లడు. వాళ్ళిద్దరూ పర్సనల్గా వెళ్తారు తప్పిస్తే ఇలా సినిమా ఇండస్ట్రీ తో సంబంధించిన పార్టీలలో లక్ష్మీ ప్రణతి పాల్గొనడం చాలా చాలా రేర్. రీసెంట్గా మల్టీ టాలెంటెడ్ యాక్టర్ ఎన్టీఆర్ ను ఓ రేంజ్ లో పొగిడేసారు.

తాజాగా బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఎన్టీఆర్ తో ఫోటో దిగి తన సోషల్ మీడియాలో ఆ పిక్ ని పోస్ట్ చేశారు. అది సెకండ్స్ లోనే వైరల్ గా మారింది. మనకు తెలిసిందే ఎన్నో ఏళ్లుగా స్టార్ నటుడిగా కొనసాగుతున్న ఆయన.. ఎన్నో నేషనల్ అవార్డ్స్, పద్మశ్రీ, పద్మ భూషణ్ లాంటి గౌరవ పతకాలని అందుకున్నారు. తాజాగా ముంబైలో ఎన్టీఆర్ తో దిగిన ఫోటోని అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసి..ఇలా రాసుకొచ్చారు. ” నా ఫేవరేట్ పర్సన్ ఈ ఎన్టీఆర్ …ఆయనని కలవడం చాలా హ్యాపీగా ఉంది. అతని వర్క్ నాకు చాలా చాలా ఇష్టం. అతను మరింత ఎదగాలి లైఫ్ లో అని కోరుకుంటున్నాను”అంటూపోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో వైరల్ గా మారింది.