వివాదాల్లో మంగళవారం బ్యూటీ.. నిర్మాతల మండలకి స్టార్ ప్రొడ్యూసర్ ఫిర్యాదు.. ఏం జరిగిందంటే..?!

టాలీవుడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇటీవల మంగళవారం సినిమాతో బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ రక్షణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. అయితే ఈ క్రమంలో పాయల్ రాజ్‌పుత్ వివాదాల్లో చెక్కుకుంది. రక్షణ మూవీ ప్రొడ్యూసర్ పాయల్‌పై తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ మండల కి ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ తమ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంది. ప్రొడ్యూసర్ న‌న్ను బెదిరిస్తున్నాడు అంటూ పాయల్‌ చెప్పిన కొద్ది గంటలకే ఇది జరగడం విశేషం. పాయల్ హీరోయిన్గా నటించిన రక్షణ మూవీ ఐదేళ్ల తర్వాత రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో మూవీ ప్రొడ్యూసర్, పాయల్ మద్య విభేదాలు బయటపడ్డాయి.

పాయ‌ల్‌కు ఇవ్వాల్సిన రూ.6 లక్షల రెమ్యునరేషన్ కూడా ఇచ్చానని.. ఆమె ప్రమోషన్స్ కు రావడం లేదు.. సహకరించడం లేదంటూ ప్రదీప్ ఠాకూర్‌ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు. సోమవారం ప్రొడ్యూసర్ కౌన్సిల్ తమ ఎక్ ద్వారా ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. అతను చేసిన ఫిర్యాదుకు కాపిని కూడా షేర్ చేసుకుంది తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వకుండా వేధిస్తున్నారు అంటూ పాయల్ ట్విట్ చేసిన కొద్ది నిమిషాలకే.. కౌంటర్గా ప్రదీప్ మొత్తం రెమ్యునరేషన్ ఇచ్చేసానని.. ఆమె ప్రమోషన్స్‌కు రావడం లేదంటూ.. గత మార్చిలో అతను ఈ ఫిర్యాదు చేసినట్లు నిర్మాత మండలి తమ ప్రెస్ నోట్ ద్వారా వివరించింది. ఏప్రిల్ లోని తమ సినిమా రిలీజ్ చేయాలని భావించాం.

Payal Rajput claims a producer asked her to show her 'assets' | Telugu  Cinema

నాలుగేళ్ల కిందటి సినిమా కావడంతో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని ఆమె చెప్పిందని.. ఆ ఫిర్యాదులో నిర్మాత ఆరోపించాడు. ప్రమోషన్లకు వస్తే మిగిలిన రెమ్యునరేషన్ కూడా ఇచ్చేస్తామని చెప్పినా ఆమె ప్రమోషన్స్ కు రాలేదంటూ వివరించాడు. నిర్మాతల మండలి తో పాటు.. మూవీ ఆర్టిసి అసోసియేషన్ ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేసినట్లు ప్రొడ్యూసర్ కౌన్సిల్ వివరించింది. పాయల్ సినిమాలో నటించిన ఆమె పేరు వాడుకునే హక్కు ప్రొడ్యూసర్ ప్రదీప్‌కు ఉందని ప్రొడ్యూసర్ కౌన్సిల్ వెల్లడించింది. అంతకుముందు ఆదివారం పాయల్ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. రక్షణ సినిమా ప్రమోట్ చేయకపోతే తనను టాలీవుడ్ నుంచి బహిష్కరిస్తామంటూ బెదిరిస్తున్నారని.. ఆమె ఆరోపించింది.

Payal vs Producer: Fight Goes to TFPC for Justice

నేను రక్షణ మూవీలో చేశా. నిజానికి 2019, 20 లోనే పైడబ్ల్యూస్ పేరుతో మూవీ షూటింగ్ పూర్తి చేశారు. సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు వాళ్లు నా సక్సెస్ ను వాడుకొని లబ్ధి పొందాలని భావిస్తున్నారు. నాకు ఇవ్వాల్సిన మిగిలిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వకుండా ప్రమోషన్లు చేయమంటూ డిమాండ్ చేస్తున్నారు.. ముందుగానే కుదిరిన ఒప్పందాల కారణంగా తాను అందుబాటులో ఉండనని టీం చెప్పినా.. వినకుండా తనను తెలుగు సినిమా నుంచి నిషేదిస్తామంటూ బెదిరిస్తున్నారని పాయల్‌ వివరించింది. ఈ మధ్య నేను నేరుగా వారిని కలిసినప్పుడు అసభ్యకరంగా మాట్లాడారని.. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు వివరించింది. అంతేకాదు అంగీకారం లేకుండా సినిమా రిలీజ్ చేస్తున్నారని పాయల్ చెప్పుకొచ్చింది. రక్షణ మూవీలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఈమె నటించింది.