తెలంగాణ ఎంసెట్లో టాప్ రాంక్ కొట్టిన సమంత ఫ్యాన్.. హీరోయిన్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గ‌తేడాది శకుంతలం, ఖుషి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించింది. అయితే తరువాత మయోసైటిస్ ట్రీట్మెంట్ కోసం విదేశాలకు వెళ్లి సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఇటీవల విదేశాల‌ నుంచి తిరిగి వచ్చింది. అయితే తర్వాత షూటింగ్లో బిజీగా అవుతుందని ఫ్యాన్స్ భావించారు.. కానీ అలా ఏం జరగలేదు. ప్రస్తుతం సమంత చేతిలో కేవలం సిటాడెల్ వెబ్ సిరీస్ మాత్రమే ఉండడం ఆశ్చర్యం. అయితే తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా నిర్మాతగా మా ఇంటి బంగారం అంటూ ఓ సినిమాను అనౌన్స్ చేసింది శ్యామ్.

Samantha turns into a producer for her new movie! - Official motion poster  out - Tamil News - IndiaGlitz.com

గతేడాదంతా సినిమాలకు దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అస్డేట్స్ ఎప్ప‌టిక‌పుడు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. కాగా తాజాగా ఈమె ఇన్స్టా స్టోరీలో ఆసక్తికరమైన పోస్టును షేర్ చేసింది. ఇటీవల రిలీజ్ అయిన తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో సమంత ఫ్యాన్ ఓ అమ్మాయి మంచి ర్యాంక్స్ సాధించిందని.. తన డై హార్ట్ ఫ్యాన్ అయినా ఈ అమ్మాయి ఎంసెట్‌లో మంచి ర్యాంక్ సాధించడం నాకు ఆనందాన్ని కల్పిస్తోందంటూ సమంత వివరించింది. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆ టాప్ ర్యాంకర్‌కు విషెస్ తెలియజేసింది.

తన ఇన్‌స్టా స్టోరీలో తన డైహార్ట్‌ ఫ్యాన్ తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది లిటిల్ చాంపియన్.. అంటూ వివరించింది. ప్రస్తుతం శ్యామ్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఎంసెట్ ఫలితాల్లో మంచి ర్యాంక్ సాధించిన ఆ అమ్మాయిని.. స్టార్ సెలబ్రిటీ రేంజ్ లో ఉన్నా కూడా.. గుర్తుంచుకొని మరి అభినందించడంతో సమంతపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజ‌న్లు.