భార్యతో కలిసి అలాంటి ప్లేస్ లో కనిపించిన బన్నీ.. షాక్ లో ఫ్యాన్స్.. మ్యాటర్ ఏంటంటే..?!

అల్లు అర్జున్ ఇటీవ‌ల లేనిపోనీ వివాదాల్లో చిక్కుకొని ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ వచ్చాడు. మెగా అభిమానులకు విరోధిగా మారిన బన్నీ.. నంద్యాల వైసీపీ అభ్యర్థికి సపోర్ట్‌గా ప్రచారం చేయడంతో.. నాగబాబు కూడా ఇన్ డైరెక్ట్‌గా బన్నీపై సంచలన ట్వీట్ చేశాడు. ఇటీవల ఆ వార్తలకు ఎండ్‌ కార్డ్‌ పడింది. అయితే తాజాగా బన్నీ కి సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారింది.

Allu Arjun, Sneha spotted at a dhaba; fans hail them for their  'simplicity'. See pic - Hindustan Times

ఆయనకు సంబంధించిన ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో భార్యతో కలిసి బన్నీ కనిపించాడు. అసలు మ్యాటర్ ఏంటంటే.. బన్నీ ఓ చిన్న దాబాలో భార్య‌ స్నేహారెడ్డి తో కలిసి భోజనం చేస్తూ ఉన్న ఫోటో ఒకటి నెటింట‌ వైరల్ అవుతుంది. పుష్ప మూవీ తర్వాత బన్నీ పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఎక్కడ కనిపించినా జనం కొమ్ముకూడిపోతూ సందడి చేస్తున్నారు. అలాంటిది బ‌న్నీ సింపుల్గా ఓ దాబాలో భోజనం చేస్తూ కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

Allu Arjun, Wife Sneha Reddy Spotted Enjoying Lunch At A Local Hotel, Photo  Goes Viral; See Here - News18

ఎన్నికల్లో నిలబడ్డ ఫ్రెండ్ కోసం సపోర్ట్ గా వెళ్లిన బన్నీ.. తిరిగి వచ్చే క్రమంలో దాబాలో లంచ్ చేసి ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం అలాంటి చిన్ని దాబాల్లో ఎటువంటి హంగులు లేకుండా భోజనం చేస్తున్న అల్లు అర్జున్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం బన్నీ పుష్ప 2 షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.