‘ కల్కి ‘ ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్స్ ఫిక్స్.. రెండు ఓటీటీలలో.. ఏకంగా ఎన్ని కోట్లకు అమ్మారంటే..?!

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏడాది సంక్రాంతి తర్వాత ఒక్క సరైన మూవీ కూడా థియేటర్లకు రాకపోవడం తో సమ్మర్ సీజన్ అంత వేస్ట్ అయిపోయింది. అయితే కల్కి రిలీజైతే మళ్లీ ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పిస్తుందని అంతా భావిస్తున్నారు. ఇక రిలీజ్కు దాదాపు నెలరోజులు మాత్రమే ఉండడంతో.. ప్రమోషన్స్ ఆల్రెడీ మొదలెట్టేసారు మేకర్స్. తాజాగా ఓటీటీ హక్కులను కూడా రెండు ప్రముఖ సంస్థలు సొంతం చేసుకున్నాయంటూ తెలుస్తుంది.

Kalki 2898 AD (2024) - Movie | Reviews, Cast & Release Date in pitlam-  BookMyShow

బాహుబలి తర్వాత ప్రభాస్ ఒప్పుకున్న పాన్ ఇండియా సినిమాల్లో కల్కి ఒకటి. మహానటితో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న నాగఅశ్విన్ దాదాపు ఐదారాళ్ళ‌నుంచి ప్రాజెక్టుపై పని చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం విడుదలకు సిద్ధమైన ఈ సినిమా జూన్ 27న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా హక్కులను రెండు ఓటీటీ సంస్థలకు అమ్మినట్లు తెలుస్తుంది. హిందీ వర్షన్ హక్కులను రూ.200 కోట్లకు సొంతం చేసుకుందట. అలాగే సౌత్ ఓటీటీ హక్కులను రూ.175 కోట్లకు అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని సమాచారం. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే మాత్రం రికార్డ్ సృష్టించిన‌ట్లే.

Manobhiram__DHFM on X: "KALKI 2898-AD Alternative Poster Design #Prabhas  #Kalki2898 #Kalki2898AD #Kalki2898ADonJune27 #Salaar2 @nagashwin7  @VyjayanthiFilms @Kalki2898AD https://t.co/a0g5G45uDU" / X

ఇకపోతే కల్కిలో ప్రభాస్ తో పాటు దీపిక పదుకొనే, అమితాబచ్చన్, కమల్ హాసన్, దిశ పఠాని ఇలాంటి భారీ క్యాస్టింగ్ అంతా ఆకట్టుకోనున్నారు. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ కూడా సినిమాల్లో నటించారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. వైజయంతి మూవీస్ దాదాపు రూ.600 కోట్ల భారీ బడ్జెట్లో ఈ సినిమా తెరకెక్కించింది. ప్రస్తుతం రెండు ఓటీటీ సంస్థలు ఈ సినిమా హక్కులను పైగా అంత భారీగా ఖర్చు చేసి మరీ హ‌క్కులు సొంతం చేసుకున్నాయని తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాతో డార్లింగ్ మరోసారి రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం అంటూ తమ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు.