ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు..సమంత ఒక్కటే ఉన్నప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?

అదేదో సినిమాలో బన్నీ చెప్పినట్లు నువ్వేంటి..? నీ రియల్ క్యారెక్టర్ ఏంటి..? అని తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు ..ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు ..నువ్వు మాత్రమే ఉన్నావు అని నీకు అనిపించినప్పుడు ..ఏం చేస్తావో అదే నీ రియల్ క్యారెక్టర్ ..ఈ డైలాగ్ ఇద్దరమ్మాయిలు సినిమాలో బన్నీ అమలాపాల్ కి చెప్తాడు.. అయితే ఇప్పుడు అలాంటి ఓ న్యూస్ సమంతకు సంబంధించి వైరల్ గా మారింది. ఇండస్ట్రీలో హీరోయిన్ సమంతకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో ఇండస్ట్రీని దున్నేసిన సమంత ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురి అవ్వడంతో పాటు పలు సందేశం ఇస్తూ జనాలకు అవగాహన కల్పిస్తుంది .

సమంత ఏ పోస్ట్ పెట్టిన సెకండ్స్ లోనే వైరల్ అయిపోతుంది. మరీ ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పెట్టే పోస్టులు అభిమానులకి నచ్చుతున్న.. మిగతా జనాలకి మాత్రం నచ్చడం లేదు. రీసెంట్గా సమంత ఒక పోస్ట్ షేర్ చేసింది. నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత నాగచైతన్యతో కలిసి ఉన్నప్పుడు నిర్మించుకున్న ఇల్లును ఎక్కువ డబ్బులు పెట్టి కొనుగోలు చేసి.. ఆ ఇంట్లోనే ఉంటున్నట్లు తెలుస్తుంది .

కాగా సమంత ఇంట్లో ఒక్కటే ఒంటరిగా ఉన్నప్పుడు .. తన పెట్ డాగ్స్ తో కలిసి టైం స్పెండ్ చేస్తుంది. ఎంజాయ్ చేస్తుంది అంటూ తాజా ఫొటోస్ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు .. ఆమె తాజాగా అలాంటి ఫోటోలు కూడా షేర్ చేసింది . “నా పెట్ డాగ్స్ ఇవి ..ఎప్పటికీ నన్ను అంటిపెట్టుకొని ఉంటాయి.. నా డార్లింగ్స్ “అంటూ క్యాప్షన్ ఇచ్చింది . ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి . సమంత చేతుల్లో ప్రస్తుతం బడా ప్రాజెక్ట్స్ ఏమీ లేవు .. అసలు ఆమె సినిమా ఇండస్ట్రీలో రానున్న రోజుల్లో సెటిల్ అవుతుందా? సెటిల్ అవ్వదా ..? అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం నిరంతరం ఆక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ..!!