ప్రభాస్ కంటే ముందుగానే అభిమానులను సర్ ప్రైజ్ చేసిన నాగచైతన్య.. ఈ స్వీట్ షాక్ మామూలుగా లేదురోయ్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. డార్లింగ్ ప్రభాస్ చెప్పాడు అంతే .. హీరో నాగచైతన్య చేసి చూపించాడు .. దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ అక్కినేని ఫ్యామిలీ అంటూ ఓ రేంజ్ లో నాగచైతన్యను పొగిడేస్తున్నారు అభిమానులు . మనకు తెలిసిందే.. రీసెంట్గా ప్రభాస్ తన లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ఓ పోస్ట్ పెట్టాడు . ఆ పోస్ట్ గురించి పాన్ ఇండియా వైడ్ వార్తలు వినిపించాయి.

 

హీరోయిన్ అనుష్క శెట్టితో పెళ్లి అని .. పొలిటిషియన్ మనవరాలు తో పెళ్లి అంటూ రకరకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే సీన్ కట్ చేస్తే కల్కి సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఆయన ఆ పోస్ట్ పెట్టినట్లు క్లారిటీ వచ్చేసింది. అయితే కల్కి సినిమాలో ఆయన వాడే ఓ స్పెషల్ వాహనం కోసమే ఇంత పబ్లిసిటీ చేసుకున్నారు అని క్లారిటీకొచ్చేసింది. అయితే ప్రభాస్ తన స్పెషల్ కార్ ని పరిచయం చేయకముందే నాగచైతన్య తన ఇంటికి కొత్త కారుని కొనుక్కొచుకున్నాడు .

నాగచైతన్య రీసెంట్గా కొత్త కారు కొనుగోలు చేశారు . నాగచైతన్య pOrsh 911 GT3 కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది . కాగా భారతదేశంలో పోrsh 911 GT3 ఆర్ఎస్ ఎక్స్ షోరూం ధర 3కోట్ల 51 లక్షలు గా తెలుస్తుంది . ప్రస్తుతం ఈ కారుతో నాగచైతన్య దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . అంతేకాదు నాగచైతన్య ఈ కారుని ఎంతో ఎంతో ఇష్టంగా కొనుక్కున్నారట. దీంతో ప్రభాస్ కంటే నాగచైతన్య లైఫ్ లోనే ముందు స్పెషల్ పర్సన్ వచ్చేసింది అంటూ ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు..!!