కాజల్ నటించిన అన్ని సినిమాల్లో ఆ రెండు ఫ్లాప్ సినిమాలు ఆమెకు అంత ఇష్టమా.. అవేంటంటే..?!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్ ఇటీవ‌ల నటించిన మూవీ సత్యభామ. ఈ సినిమా మే 31 ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ క్రమంలో వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటూ సందడి చేస్తుంది కాజల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ నటించిన సినిమాలన్నిటిలో తనకు ఇష్టమైన సినిమా ఏది అని ప్రశ్నకు స్పందిస్తూ.. ఆసక్తి సమాధానాలు చెప్పింది. ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈ అమ్మడు తను నటించిన అన్ని సినిమాల్లో తనకు సత్యభామ, సీత, బ్రహ్మోత్సవం సినిమాలంటే చాలా ఇష్టమంటూ వివరించింది.

Sita Telugu Movie Review with Rating | cinejosh.com

అయితే కాజల్ నటించిన సత్యభామ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన సీతా సినిమాలో కాజ‌ల్ హీరోయిన్‌గా చేసిన‌ సంగతి తెలిసిందే. ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమా కూడా ఎన్నో అంచనాలు నడుమున రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మహేష్ నటించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌తో పాటు సమంత, ప్రణీత కూడా హీరోయిన్లుగా కనిపించారు.

Brahmotsavam new poster: Mahesh Babu & Kajal Aggarwal make an adorable pair | India.com

ఇక ఈ రెండు సినిమాలు ఫ్లాపులుగా నిలిచినా.. కాజల్ అగర్వాల్ కి మాత్రం తను నటించిన అన్ని సినిమాల్లో ఈ రెండూ చాలా ఇష్టమని వివరించింది. ఈమెకు ఇష్టమైన మరో సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు రానున్న సత్యభామ అంటూ చెప్పుకొచ్చింది. సుమ‌న్ చిక్క‌లా ద‌ర్శ‌క‌త్వం బ‌హించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో వేచి చూడాలి. కాగా ఇందులో కాజల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించింది.