టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమైన సంగతి తెలిసిందే. అయితే మనోజ్ ఇటివల మీరాయ్ సినిమాతో ఇండస్ట్రీ లోకి రియంట్రీ ఇచ్చాడు. తేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెకుతున్న ఈ సినిమాలో మనోజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా మీరాయ్ ప్రమోషనల్ ఈవెంట్లో మంచు మనోజ్ పాల్గొని సందడి చేశాడు. ఈ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ సినీ కెరీర్ పరంగా ఒకానొక టైం లో చాలా బాధపడ్డానని.. తర్వాత ఓపిక విలువ ఏంటో తెలిసిందంటూ చెప్పుకొచ్చాడు. నిన్న మంచు మనోజ్ పుట్టినరోజు వేడుకలను సెలబ్రేట్ చేస్తూ మూవీ టీం మీరాయ్ గ్లింప్స్ రిలీజ్ కు హైదరాబాదులో ఈవెంట్ నిర్వహించారు.
అభిమానులు, ప్రేక్షకులను ఉద్దేశించి మనోజ్ మాట్లాడుతూ నేను వెండితెరపై కనిపించి ఎనిమిదేళ్లయిన.. అప్పుడప్పుడు సోషల్ మీడియా, సినీ వేడుకలు ఇలా ఏదో విధంగా మీకు దగ్గరగానే ఉంటున్న అంటూ వివరించాడు. అయినా సినిమాలతో మిమ్మల్ని అలరించలేకపోయా.. మీకు విభిన్న కథలను చూపించాలన్నదే నా కోరిక.. ఏదైనా మనస్ఫూర్తిగా నటిస్తా.. డబ్బు కోసం కాకుండా మనసుకు నచ్చిన కదలని ఎంపిక చేసుకుంటూ వచ్చా. కొంత విరామం తర్వాత మళ్లీ నటించాలని ఎన్నో కథలు విన్నా.. వాటిలో కొన్ని నచ్చలేదు.. నచ్చినవి అనివార్య కారణాలతో సెట్స్ పైకి రాలేదు. ఈ నేపథ్యంలో ఎంతో నిరాశకు లోనయ్యా.. ఓపిక విలువెంటో ఇప్పుడు అర్థమవుతుంది.
మనం కలిసి ఓ సినిమాలో చేద్దామన్నా అంటూ తేజా నన్ను అడిగాడు.. దాని ప్రకారం దర్శకుడు ఘట్టమనేని కూడా నన్ను సంప్రదించి మీరాయ్ స్క్రిప్ట్ వివరించాడు. వినగానే కథ నాకు బాగా నచ్చింది అంటూ వివరించాడు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ వన్ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ కానుంది అంటూ వివరించారు. అదేవిధంగా వేదికపై తన స్నేహితుడు ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసిన మనోజ్.. రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకున్నాడు. తన పుట్టినరోజు సందర్భంగా టీజర్ విడుదల చేస్తున్న కన్నప్ప టీంకు కృతజ్ఞతలు అంటూ వివరించాడు. తన సోదరుడు విష్ణు ఈ కన్నప్పలో హీరోగా నటిస్తున్నాడు. ఇక మీరాయ్‌లో కీరోల్ ప్లే చేస్తున్న మనోజ్ హీరోగా వాట్ ద ఫిష్ సినిమాలో నటిస్తున్నాడు. భాస్కర్ బంటుమిల్లి దర్శకత్వంలో ఈ సినిమా ఫిక్స్ అయింది.