ఈ పై ఫోటోలో తల్లి వడిలో కూర్చొని క్యూట్ స్మైల్ ఇస్తున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా. ఈమె సౌత్ స్టార్ హీరోయిన్. చిన్నప్పుడే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ తో మొదటి సినిమాలో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో వరుస అవకాశాలు అందుకుంది. కానీ తెలుగులో అదృష్టం కలిసి రాలేదు. దీంతో తమిళ్ ఇండస్ట్రీకి చెకేసింది. అక్కడ సినిమాలో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా భారీపాపులారిటి సంపాదించుకుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరి ఎవరో కాదు వైట్ బ్యూటీ హన్సిక. దేశముదురు సినిమాతో హీరోయిన్గా ఇంట్రీ ఇచ్చిన హన్సిక.. అంతకుముందు హిందీలో పోయి మిల్ గయాలో చైల్డ్ ఆర్టిసిగా నటించింది.
తెలుగులో కంత్రి, బిళ్ళ, కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ ఇలా ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ సాధించినా స్టార్ హీరోయిన్గా క్రేజ్ సంపాదించలేకపోయింది. దీంతో తమిళ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అక్కడ వరుస హిట్లు అందుకుంటూ పాపులర్ బ్యూటీగా మారిపోయింది. ఇక ఇప్పటికి వరుస సినిమాలో నటిస్తు దూసుకుపోతున్న ఈ అమ్మడు ప్రస్తుతం మూడు సినిమాలలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఇక పర్సనల్ విషయానికొస్తే 2022లో సోహైల్ కతూరియా అనే బిజినెస్ మ్యాన్‌ను వివాహం చేసుకు్ది. అతనికి ఇది రెండో వివాహం. అయితే చాలామంది పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి బ్రేక్ ఇస్తూ ఉంటారు.
హన్సిక కూడా ఇదే రూట్ లో వెళ్తుందని అంత భావించారు. కానీ హన్సిక మాత్రం వివాహం తర్వాత మరింత జోరుగా సినిమాల్లో నటిస్తూ పాపులాటి దక్కించుకుంటుంది. తాజాగా తల్లితో కలిసి ఓ వీడియో షేర్ చేసిన ఈ వైట్ బ్యూటీ తన చిన్ననాటి ఫొటోస్ ను ఫాన్స్ తో సంచుకుంది. అయితే హన్సిక పోస్ట్ చూసిన ఈ ఫోటో చూసిన చాలా మంది నెటిజన్స ఆశ్చర్యపోతున్నారు. అసలు ఇది నువ్వేనా.. గుర్తుపట్టలేనంతగా చేంజ్ అయ్యావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.