అమ్మ బాబోయ్..సమంత ఆ రేంజ్ లో సంపాదిస్తుందా..? టోటల్ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా..?

ఎస్ ప్రజెంట్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. జనరల్ గా ఎవరైనా స్టార్ హీరోయిన్ కోట్ల ఆస్తి కలిగి ఉంటారు. అందులో పెద్ద ఆశ్చర్య పడాల్సిన విషయం లేదు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉండి ఆ తర్వాత కెరియర్ను ఢమాల్ అంటూ డౌన్ ఫాల్ చేసుకుని భర్తకు విడాకులు ఇచ్చేసి ప్రపంచంలోనే అరుదైన వింత జబ్బుకు గురై .. ఒకానొక సమయంలో ట్రీట్మెంట్ కోసం కూడా డబ్బులు అప్పుగా తీసుకుంది అనే వార్తలు వినిపించిన హీరోయిన్ ఇప్పుడు కోట్ల ఆస్తికి అధిపతిరాలు అయింది అనే వార్త బాగా వైరల్ గా మారింది.

ఆమె మరి ఎవరో కాదు హీరోయిన్ సమంత . టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఆ తరువాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించి స్టార్ హీరోయిన్గా మారింది . కెరియర్ పిక్స్ లో ఉండగానే నాగచైతన్యని పెళ్లి చేసుకొని అక్కినేని ఇంటికి కోడలుగా మారిపోయింది . ఆ తర్వాత కొన్ని కారణాల చేత ఆ ట్యాగ్ను తొలగించుకొని విడాకులు ఇచ్చేసి ఇప్పుడు సింగిల్గా బ్రతుకుతుంది . మయోసైటిస్ అనే అరుదైన వ్యాధికి గురైంది సమంత అనే విషయం తెలిసిందే.

ఈ వ్యాధి నుంచి బయటపడడానికి చాలా తిప్పలు పడింది . మొత్తానికి బయటపడింది . అయితే ఇప్పుడు సమంత పేరు పై ఉన్న ఆస్తికి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం సమంత టోటల్ ఆస్తి 127 కోట్లకు పైగానే ఉంటుందట . సమంత ఫ్యామిలీ రిచ్ కాదు . మిడిల్ క్లాస్ .. ఇండస్ట్రీలోకి వచ్చాక సమంత ఎంత కష్టపడి సంపాదించినా సినిమాకి రెండు మూడు ఐదు కోట్లు మాత్రమే తీసుకుంటూ వచ్చింది . విడాకులు తర్వాత భరణం కూడా నాగచైతన్య వద్ద తీసుకోలేదు . మరి సమంత ఇంత ఆస్తి ఎలా సంపాదించింది అనేది ప్రశ్నర్ధకంగా మారింది . అయితే సమంత విడాకులు తీసుకున్న తరువాత చేతిలో సినిమాలు లేకపోయినా పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసింది అని.. తద్వారా వచ్చిన డబ్బులను బిజినెస్ లో పెట్టుబడులు పెట్టి ఈ రేంజ్ లో ఆస్తులు సంపాదించుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి..!