పిల్లల విషయంలో మెహరీన్ షాకింగ్ డెసిషన్.. పెళ్లి కాకుండానే తల్లి అయ్యేందుకు అలా చేస్తున్న స్టార్ బ్యూటీ..?!

ఇటీవల స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ పిల్లల విషయంలో చేసిన కామెంట్స్ నెట్టింటి వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రోజుల్లో సరైన రిలేష‌న్ అర్ధం చేసుకున్నే వ్య‌క్తి దొర‌క‌డం చాలా కష్టం.. అందుకే ఎగ్ ప్రీజింగ్ విధానం గురించి ఆలోచిస్తున్నట్లు వివరించింది. అయితే అసలు ఎగ్ ప్రీజింగ్ అంటే ఏంటి అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. ఎగ్ ప్రీజింగ్ అంటే వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన అండాలని వైద్య విధానంతో భద్రపరచుకోవడం. కావలసినప్పుడు పిల్లలను కనే ఫెసిలిటీని కల్పిస్తున్న ఈ రిప్రొడక్షన్ పద్ధతిని చాలామంది స్టార్ హీరోయిన్స్ పాటిస్తున్నారని టాక్. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ఎగ్ ప్రీజింగ్ చేయించుకున్నారట.

Best beauty looks of 'F3' actress Mehreen Pirzada | Times of India

ఇప్పుడు హీరోయిన్ మెహరీన్ కూడా ఈ జాబితాలో చేరింది. తను ఎగ్ ప్రీజింగ్ చేయించుకున్నాను అని.. గత రెండేళ్లుగా దీనికోసం ప్రయత్నిస్తున్నానంటూ ఓ వీడియోను షేర్ చేస్తూ విష‌యాని వివ‌రించింది. ఇది నా పర్సనల్ విషయం.. కానీ అందరితో పంచుకోవాలా.. వద్దా.. అని చాలాసార్లు ఆలోచించా. నాలాంటి మహిళలు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి.. ఎప్పుడు పిల్లల్ని కనాలి అని నిర్ణయించుకోలేక సతమతమవుతూ ఉంటారు. అయితే భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమని నేను భావిస్తా. దీని గురించి ఎవరు ఎక్కువ మాట్లాడారు.. కానీ ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ సాయంతో మనం కోసం మనం మంచి నిర్ణయం తీసుకోగలం.

All you need to know about egg freezing in India

తల్లి కావాలనేది నా డ్రీమ్.. కానీ అందుకు కొన్ని సంవత్సరాలు ఆలస్యమవుతుంది. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్ విధానాన్ని అనుసరిస్తున్న. హ‌స్ప‌ట‌ల్‌ అంటే భయం ఉన్న నాలాంటి వారికి ఇది పెద్ద సవాల్ లాంటిది. ఎందుకంటే హార్మోన్ ఇంజక్షన్ల కారణంగా నేను ఆసుపత్రికి వెళ్ళిన ప్రతిసారి కళ్ళు తిరిగి పడిపోయేదాన్ని అంటూ వివరించింది. అయితే ఇది విలువైనదేనా అని అడిగితే కచ్చితంగా అవుననే చెబుతా అంటూ వివ‌రించింది. మీరు ఏ పని చేసినా మీకోసం చేయండి అంటూ రాసుకొచ్చింది. అయితే ఈ ప్రాసెస్ లో ఎప్పుడూ నా పక్కనే అండగా నిలిచిన నా గైనకాలేజీస్ట్ డాక్టర్ రమ్మీ.. మా అమ్మ..కు ధన్యవాదాలు అంటూ మెహరీన్ రాసకొచ్చింది. ప్రస్తుతం మెహరీన్ షేర్ చేసిన ఈ వీడియో పోస్ట్ నెటింట వైరల్‌గా మారుతుంది.

 

View this post on Instagram

 

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)