తెలుగు సినీ చ‌రిత్ర‌లో మొద‌టిసారి అలాంటి రికార్డ్ క్రియేట్ చేసిన ‘ పుష్ప 2 ‘.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ దర్శకత్వంలో పుష్ప రిలీజై సంచలన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇప్పటివరకు పుష్ప నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్, గ్లింప్స్ కూడా ప్రేక్షకులను భారీ లెవెల్లో ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత హైప్ నెలకొంది. సుకుమార్ సెకండ్ పార్ట్ తో కూడా ప్రేక్షకుల్లో మరో బ్లాక్ బస్టర్ కొట్టే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే.. ఆ లెవెల్ లో పాన్ ఇండియా బిజినెస్ లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

బాలీవుడ్ లోను ఇప్పటివరకు కనివిని ఎరుగని రేంజ్ లో ఈ సినిమాకు బిజినెస్ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను సౌత్ అన్ని భాషలతో పాటు హిందీలో మాత్రమే రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే ఈ సినిమాను బెంగాలీ భాషలో కూడా డబ్‌ చేసి రిలీజ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ సినిమాల్లో కూడా చాలా అరుదుగా కొన్ని సినిమాలు బెంగాలీలో రిలీజై మంచి టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఇప్పటివరకు సౌత్ నుంచి అది కూడా టాలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా బెంగాలీలో రిలీజ్ కాలేదు.

ఇలాంటి క్రమంలో పుష్ప 2 సినిమాను బెంగాలీ భాషలో రిలీజ్ చేస్తున్నారంటూ తెలుస్తుంది. ఇనేళ్ళ‌ తెలుగు సినీ చరిత్రలో పుష్పా2 మాత్రమే ఈ రికార్డుని క్రియేట్ చేసింది. బెంగాలీలో రిలీజ్ కోసం దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ ను అక్కడ సింగర్స్ తో పాడించే ఏర్పాట్లు చేస్తున్నారట మేకర్స్. మొత్తానికి నార్త్ ఆడియన్స్ ను రీచ్ అయ్యేలా పుష్ప 2 భారీ ప్లాన్ చేసుకుంటుందని టాక్. పాన్ ఇండియా లెవెల్ లో అత్యధిక థియేటర్లో పుష్ప 2ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.