పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. హరిహర వీరమల్లు టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..?!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్‌లో ఉన్న‌ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. న‌ట‌న‌తో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్.. వ్యక్తిగతంగాను తన మంచి పనులతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న పవన్.. గత కొంతకాలంగా వరుస సినిమాలకు సైన్ చేస్తూ షాక్ ఇచ్చాడు. ఓ పక్క పాలిటిక్స్ లో బిజీగా గడుపుతూనే.. మరో పక్క సినిమా షూటింగ్లలో కూడా సందడి చేశాడు. అయితే ఏప‌పి సార్వత్రిక‌ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా షూటింగ్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో ప‌వ‌న్ సినిమాల‌పై ఇప్ప‌ట్లో ఎలాంటి అప్డేట్ వ‌చ్చే ఛాన్స్‌లు లేవ‌ని ఫిక్స్ అయ్యారు. కాగా ప‌వ‌న్ న‌టిస్తున్న సినిమాల‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా కూడా ఒక‌టి.

Hari Hara Veera Mallu to resume soon!

ఈ మూవీ షూటింగ్ దాదాపు మూడు సంవత్సరాల నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా.. సినిమాకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినా బాగుండు అంటూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా కళ్ళకు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ మొదటిసారి ఈ సినిమాతో వారియర్ గా కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో.. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా 70 శాతం షూట్‌ పూర్తయిందని.. పొలిటికల్ క్యాంపెయిన్ లో పవన్ బిజీగా ఉండటంతోనే మిగతా పార్ట్‌ డిలే అవుతుందని తెలుస్తోంది.

దీంతో ఈ మూవీ రిలీజ్ డేట్ ఇతర అప్డేట్స్ పై కూడా ఎటువంటి సమాచారం రాలేదు. అయితే తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ అందించారు మేకర్స్. ఎవరు ఊహించని టైంలో ఈ మూవీ టీజర్ రిలీజ్ ను అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ ట్రైండింగ్‌ గా మారింది. ధర్మం కోసం యుద్ధం అంటూ ఓ పోస్టర్‌తో.. టీజర్ డేట్ ను అనౌన్స్ చేశారు. మే 2 ఉదయం 9 గంటలకు ఈ సినిమా టీజర్ రిలీజ్ చెస్తున‌ట్లు ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో టీజర్ రిలీజ్ చేస్తుండడంతో ప్రేక్షకుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే యాక్షన్ డ్రాప్‌తో అదిరిపోయే టీజర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సినీ వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. మరి కొందరు మాత్రం పొలిటికల్ పంచ్ తో ఏన్నిక‌ల మైలేజ్ పెంచేలా ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ త‌మ అభిప్రాయాని వ్య‌క్తం చేస్తున్నారు.