టాలీవుడ్ కింగ్ తో తలపడనున్న యానిమల్ విలన్.. అసలు మ్యాటర్ ఏంటంటే..?!

పాన్ ఇండియన్ మూవీ కుబేర తరువాత నాగార్జున నెక్స్ట్ మూవీపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. స్టూడియో గ్రీన్ బ్యానర్ తమిళ్ దర్శకుడు నవీన్ తో నాగ్ ఓ సినిమా చేయనున్నాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ థ్రిల్లర్గా రిలీజ్ కానున్న ఈ సినిమాలో.. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ ఓ ప్రధాన పాత్రలో పోషించనున్నారని తెలుస్తోంది. ఇటీవల రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన యానిమల్ సినిమాలో ఈయన విలన్ పాత్రలో నటించి ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.

Kubera: Dhanush, Nagarjuna, Sekhar Kammula film begins new schedule in  Thailand Tamil Movie, Music Reviews and News

అయితే ప్రస్తుతం నాగార్జునను ఢీకొట్టే ప్రతి నాయకుడిగా.. శక్తివంతమైన పాత్రలో బాబి డియల్ కనిపించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూట్ జూన్ నెలలో ప్రారంభించనున్నారని టాక్. ఈ సినిమాలో నాగార్జునకు జంటగా ఇద్దరు హీరోయిన్స్ కనిపించనున్నారు. అయితే ఇంకా వారెవరో అనే అంశంపై మాత్రం క్లారిటీ రాలేదు.

Filmy Focus on X: "Tamil Director #Naveen is in talks with #Nagarjuna to  direct his prestigious 100th film. The director's previous works include  'Moodar Koodam' and #AgniSiragugal. #NAG100 https://t.co/2xx4ubFubK" / X

ఇక నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రలో శేఖర్ కమ్ముల తెర‌కెక్కిస్తున్న కుబేర సినిమాలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్‌రావు సంయుక్తంగా ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. రష్మిక కథానాయకగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక మే రెండున ఈ సినిమా నుంచి ఓ అద్భుతమైన అప్డేట్ బయటకు రానుందని సినిమా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఓ భారీ పిడుగు సీజ్ చేసి లోడ్ చేయడం జరిగిందంటూ.. నిర్మాణ సంస్థ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకున్నారు. దీన్ని బట్టి ఈ సినిమా నుంచి ఓ వీడియో గ్లింప్స్‌ బయటకు రానున్నట్లు తెలుస్తోంది.