బన్నీ పాటకు మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన రణ్ వీర్.. దేవి శ్రీ ప్రసాద్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్.. (వీడియో)

బాలీవుడ్ స్టార్ ర‌ణ్‌వీర్ సింగ్ ఎప్పుడు ఫుల్ జోష్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. ఏదైనా ఈవెంట్ కానీ, స్పెషల్ ప్రోగ్రాంలో కానీ మెరిసాడంటే.. స్పెషల్ ఎట్రాక్షన్ గా మారిపోతాడు. ఆ ఈవెంట్ మొత్తంలో సందడి చేస్తూ అందరి లుక్‌ను తన వైపు తిప్పుకుంటాడు. డ్యాన్స్‌ల‌తో దుమ్ము రేపే ఈ స్టార్ హీరో.. తాజాగా తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ శంకర్ కూతురు ఐశ్వర్య వివాహ రిసెప్షన్ లో అద‌ర‌గొట్టాడు. తన మాస్టెప్స్ తో మార్క్ డ్యాన్స్ తో జనాన్ని ఆకట్టుకున్నాడు. ఈ వీడియోను స్వయంగా టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు.

Ranveer Singh, Devi Sri Prasad energetic dance to Pushpa's Oo Antava - Telugu News - IndiaGlitz.com

అల్లు అర్జున్ హీరోగా వ‌చ్చి పాన్ ఇండియ‌న్‌ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన‌ పుష్పా మూవీలో ఊ అంటావా మావా ఊ.. ఊ.. అంటావా మావా పాట మరిన్ని రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పాటకు ర‌ణ్‌వీర్ సింగ్ మాస్ స్టెప్స్ తో అదరగొట్టాడు. ఐశ్వర్య శంకర్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకల్లో ఈ పాటకు చిందేశాడు ర‌ణ్‌వీర్. ఈ సాంగ్‌కు మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించిన దేవిశ్రీప్రసాద్ తో కలిసి చిందేసిన ర‌ణ్‌వీర్ చిరునవ్వులు చిందిస్తూ పాటను ఎంజాయ్ చేశాడు. మరోవైపు దేవిని గిల్లుతూ చిలిపి చేష్టలు చేశాడు. మొత్తంగా ఫుల్ జేష్‌తో ఈ పాటలో తన మార్క్ స్టెప్పులతో అదరగొట్టాడు.

Ranveer Singh, Devi Sri Prasad energetic dance to Pushpa's Oo Antava - Telugu News - IndiaGlitz.com

కాగా నిన్న అంతర్జాతీయ డ్యాన్స్ డే సందర్భంగా డిఎస్పి ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే అంటూ తెలియజేసిన డిఎస్పి.. సంతోషంలో ఉన్న.. బాధలో ఉన్న.. డ్యాన్స్ చేయాలని నేను నమ్ముతా. డైరెక్టర్ శంకర్ కూతురి వెడ్డింగ్ రిసెప్షన్‌లో నాకు ఈ అద్భుతమైన డ్యాన్స్ మంచి జ్ఞాపకాన్ని ఇచ్చింది. బ్రదర్ ర‌ణ్‌వీర్ సింగ్ నీకు చాలా థాంక్స్ అంటూ క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేశాడు. అయితే గతంలో ర‌ణ్‌వీర్ కూడా ఊ అంటావా పాట లిరిక్స్ నాకు అర్థం కాకపోయినా.. ఆ పాట అంటే చాలా ఇష్టం అంటూ వివరించాడు. ఈ నేపథ్యంలో ర‌ణ్‌వీర్ డ్యాన్స్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా ర‌ణ్‌వీర్ డ్యాన్స్‌కు ఫిదా అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Devi Sri Prasad (@thisisdsp)